వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీక్రెట్ న్యూక్లియర్ సిటీ నిర్మాణం అవాస్తవం: డిఏఈ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు 260 కిలోమీటర్ల దూరంలోని చెళ్లికెరలో రహస్య అణు నగరాన్ని భారత్‌ నిర్మిస్తోందనీ, జార్ఖండ్‌లోని జాదూగూడ యురేనియం నిక్షేపాల నుంచి రేడియోధార్మిక పదార్థాలు విడుదల అవుతున్నాయన్న ప్రచారాన్ని విదేశీ వ్యవహారాలు, అణు విద్యుత్‌ శాఖ(డిఏఈ)లు కొట్టిపారేశాయి.

ప్రతిష్ఠాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో చేరేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో.. వాస్తవాలను వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా భారత్‌పై జరుగుతున్న దుష్ప్రచారమని పేర్కొన్నాయి.

India Is Not Building A Secret Nuclear City: DAE

9/11 ఉగ్రవాదుల దాడుల తర్వాత అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ అణు విద్యుత్‌ సంస్థ (ఐఏఈఏ) నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను భారత అణు వ్యవస్థ ఖచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేశారు.

భారత్‌-అమెరికా అణు ఒప్పందం సమయంలో డిఏఈ కార్యదర్శిగా కకోడ్కర్‌ ఉన్నారని చెప్పారు. జాదూగూడ యురేనియం నిక్షేపాలపై ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటెగ్రిటీ' తన వెబ్‌ పోర్టల్‌ ప్రచురించిన కథనాల్లో వాస్తవం లేదని డీఏఈ అధికారులు పేర్కొన్నారు. రహస్య అణు కార్యక్రమాలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశారు.

English summary
The Indian nuclear establishment has denied the country is building a secret nuclear city as claimed in an article in Foreign Policy magazine of the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X