భారత గణతంత్రకు బ్రిటిష్ అతిథి -‘2021 రిపబ్లిక్ డే’ చీఫ్ గెస్ట్‌గా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి విశిష్ట అతిథిగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. జనవరి 26న ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే వేడుకలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం యూకే ప్రధానికి అధికారికంగా ఆహ్వానం పంపింది. అంతకుముందు(నవంబర్ 27న) జీ-7 దేశాల సదస్సు సందర్భంలోనూ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ఈ విషయంపై జాన్సన్‌తో ఫోన్‌లో సంభాషించారు.

ఇండియా రిపబ్లిక్ డే సంబురాల్లో బ్రిటన్ ప్రధాని చీఫ్ గెస్టుగా పాల్గొననుంటడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా, 1993లో నాటి యూకే ప్రధాని జాన్ మేయర్ మన రిపబ్లిక్ డేకు అతిథిగా వచ్చారు. ఇటీవల కాలంలో భారత్, యూకే సంబంధాలు కొత్త ఎత్తులకు చేరిన నేపథ్యంలో ఆ దేశ ప్రధానికి భారత్ ఆహ్వానం పంపడం గమనార్హం. అయితే, వేడుకలకు బోరిస్ జాన్సన్ హాజరయ్యే అంశంపై బ్రిటన్ ప్రభుత్వం అధికారిక నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.

India makes its move, invites Boris Johnson to be Republic Day chief guest

ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారత్.. దశాబ్దాల పోరాటం అనంతరం 1947లో స్వాతంత్ర్యం పొంది, 1950 జనవరి 26 నుంచి సొంత రాజ్యాంగంతో గణతంత్ర్య రాజ్యంగా అవతరించింది. 2022నాటికి భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తికానున్నాయి.

గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని‌ని ఆహ్వానించడం మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. మోదీ, జాన్సన్ ఫోన్ సంభాషణ సందర్భంగానూ ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై కీలకంగా చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+