Vande Bharat డిజైన్‌తో రూ.100 వెండి నాణెం విడుదల, కానీ చెల్లదు
దేశంలో విద్యుత్ రైళ్ల శతాబ్దిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక రంగుల స్మారక నాణెం కలెక్టర్లలో ఆసక్తి రేపుతోంది. భారత రైల్వే చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ ఘట్టానికి గుర్తుగా విడుదలైన రూ.100 నాణెం అరుదైన సంపాద్యంగా మారింది. ముఖ్యంగా వందేభారత్ రైలు చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ నాణెం సేకరణకారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
భారతదేశంలో తొలి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న అప్పటి బాంబేలో (ప్రస్తుత Mumbai) విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా వరకు ప్రారంభమైంది. ఈ ప్రయాణంతో భారత రైల్వేలో ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి విద్యుతీకరణ దశలవారీగా విస్తరించి, నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మార్గాలు విద్యుతీకరణకు లోనయ్యాయి. ప్రస్తుతం Indian Railways ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది.

Vande Bharat రైలు ప్రతిరూపం..
ఈ చారిత్రక ప్రయాణానికి 100 సంవత్సరాలు పూర్తవ్వడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్మారక నాణెాన్ని విడుదల చేశారు. రూ.100 విలువ గల ఈ నాణెం 35 గ్రాముల బరువుతో రూపొందించబడింది. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమాలున్నాయి. నాణెం ముందుభాగంలో రంగుల్లో మెరిసే వందేభారత్ రైలు ప్రతిరూపం ఉండగా, వెనుక భాగంలో అశోక స్థంభం మరియు 'భారత ప్రభుత్వం' ముద్రించబడ్డాయి. ఈ నాణెన్ని India Government Mint Kolkata మింట్ చేసింది.
చలామణి కోసం కాకుండా..
సాధారణ చలామణి కోసం కాకుండా, కలెక్టర్ల కోసం మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ నాణేలు మింట్ చేయడం విశేషం. ఫేస్ విలువ రూ.100 అయినప్పటికీ, వెండి మిశ్రమం మరియు మింటింగ్ ఖర్చుల కారణంగా అధికారిక ధర రూ.8,000కు పైగానే నిర్ణయించారు. ఇదే నాణెన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన నాణేల సేకర్త మహ్మద్ వాయిజ్ ఆన్‌లైన్‌లో జనవరి 13న రూ.8,072లకు కొనుగోలు చేశారు. శనివారం ఆయనకు కోల్‌కతా మింట్ నుంచి నాణెం అందింది. అరుదైన స్మారక నాణేలను సేకరించడం తనకు హాబీ అని వాయిజ్ తెలిపారు. విద్యుత్ రైళ్ల శతాబ్దిని గుర్తుచేసే ఈ ప్రత్యేక నాణెం తన సేకరణలో ఉండడం గర్వంగా ఉందని చెప్పారు.
భారతీయ రైల్వే ప్రగతికి ప్రతీకగా
రైల్వే రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. విద్యుతీకరణ వల్ల ఇంధన వ్యయం తగ్గడం, కాలుష్యం నియంత్రణ, వేగవంతమైన రవాణా వంటి అనేక ప్రయోజనాలు సాధ్యమయ్యాయి. వందేభారత్ వంటి ఆధునిక రైళ్లు దేశ రవాణా రంగానికి నూతన దిశను చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో శతాబ్దిని పురస్కరించుకుని విడుదలైన ఈ రంగుల నాణెం భారతీయ రైల్వే ప్రగతికి ప్రతీకగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి స్మారక నాణేలు విలువ మరింత పెరిగే అవకాశముందని నాణేల సేకరణకారులు భావిస్తున్నారు. విద్యుత్ రైళ్ల శతాబ్దిని స్మరించుకునే ఈ ప్రత్యేక నాణెం దేశ రైల్వే చరిత్రలో మరో గుర్తుగా నిలిచిపోనుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications