తొలిసారి 12 అణు వార్ హెడ్స్ మోహరించిన భారత్? షాకింగ్ రిపోర్ట్..!
అణ్వాయుధాల్ని శత్రువులపై ముందుగా ప్రయోగించకూడదనేది భారత్ కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న సిద్దాంతం. కానీ ఇప్పుడు దానికి తిలోదకాలు ఇచ్చేందుకు రంగం సిద్దమవుతుందా అన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం తాజాగా భారత్ తమకున్న 190 అణు వార్ హెడ్లలో 12 వార్ హెడ్లను (Nuclear Warheads) మోహరించినట్లు ఓ నివేదిక వెలువడింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. భారత్ తొలిసారి 12 అణు వార్‌హెడ్లను మోహరించింది.
దశాబ్దాలుగా పాటిస్తున్న పాత విధానానికి భిన్నంగా, అణు వార్‌హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే పద్ధతిని వదిలేసి, వాటిని సిద్ధంగా ఉంచే ప్రక్రియను భారత్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆయుధాల డేటాను విశ్లేషించే ప్రధాన సంస్థ SIPRI.. భారత్ అణు సామర్థ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అణు వార్‌హెడ్లను ఇప్పటివరకు ప్రత్యేక నిల్వ కేంద్రాలకే పరిమితం చేసిన భారత్, గతంలో ఎన్నడూ లేనంతగా వాటిని క్షిపణి సైలోలు, అణు జలాంతర్గాములకు అనుసంధానించింది. ఈ మొబైలైజేషన్ ప్రక్రియ దేశ అణు సన్నద్ధతను మరింత పెంచినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

జనవరి 2026 నాటికి భారత అణు ఆయుధ సంపత్తి 190కి చేరిందని ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది కాలంలో ఈ సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ ఆయుధాలను గగనతల, భూతల క్షిపణి వ్యవస్థలు, ఎస్‌ఎస్‌బీఎన్ లతో కూడిన అణు త్రయాన్ని (Nuclear Triad) మరింత బలోపేతం చేయడానికి కేటాయించినట్లు తాజాగా విడుదలైన సిప్రీ నివేదిక తెలిపింది. శాంతి కాలంలో అణు వార్‌హెడ్లను డెలివరీ సిస్టమ్‌లకు దూరంగా నిల్వ చేస్తుందని భారత్ గురించి చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే, క్షిపణులను క్యానిస్టర్లలో ఉంచడం, సముద్ర గర్భంలో నిఘా పెంచడం వంటి చర్యలు, వార్‌హెడ్లను ప్రయోగ వ్యవస్థలతో అనుసంధానించే దిశగా భారత్ మారుతోందని సూచిస్తున్నాయని నివేదిక తెలిపింది.














Click it and Unblock the Notifications