భారత్, పాక్, బంగ్లా ఒకటైతే అఖండ భారత్: బీజేపీ
న్యూఢిల్లీ: భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు మళ్లీ కలిసి పోయి అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ యాదవ్ జోస్యం చెప్పారు. కేవలం చారిత్రక కారణాలతో 60 ఏళ్ల క్రితం ఈ మూడు దేశాలు విడిపోయాయని అన్నారు.
ఈ మూడు దేశాలు మళ్లీ కచ్చితంగా ఒకటైపోతాయని, అఖండ భారతావని ఏర్పడటం ఖాయం అని అన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రామ్ యాదవ్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్న తనకు ఆ విశ్వాసం ఉందని రామ్ యాదవ్ స్పష్టం చేశారు.
అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకోరాదని ఇదే సందర్బంలో ఆయన అన్నారు. తామేదో ఇతర దేశాల మీద యుద్దానికి వెళ్తామనో, బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని రామ్ యాదవ్ అన్నారు.

ప్రజాభిప్రాయంతోనే అఖండ భారతావని ఏర్పడుతుందని అన్నారు. గతంలో భారతదేశాన్ని హిందూ దేశంగా అభివర్ణించిన అశంమీద ఆయన స్పందించారు. భారతదేశానికి అంతటికీ ఓ సాంప్రధాయం ఉందని అన్నారు.
అఖండ భారతావని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది. కేవలం ప్రాచారం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించింది. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications