Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్-పాక్ సీజ్ ఫైర్ చేసిందెవరు ? ట్రంప్ కు పోటీగా చైనా ! కేంద్రం కౌంటర్..!

ఈ ఏడాది మేలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్దితి ఏర్పడింది. పాకిస్తాన్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని, గట్టిగా గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోరు తర్వాత హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. దీన్ని తొలుత ఖండించని కేంద్రం.. ఆ తర్వాత విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చింది.

పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరడంతో తమ అధికారులు అంగీకరించారని భారత్ తేల్చిచెప్పింది. అయితే ఆ వాదనను విరుద్దంగా ఆ తర్వాత పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యవర్తిత్వంతోనే భారత్-పాక్ యుద్దం ఆగిందని చెప్తూ వచ్చారు. దీన్ని భారత్ కూడా పలుమార్లు ఖండించింది. అయినా ట్రంప్ తీరు మారకపోవడంతో భారత్ కూడా ఆ విషయాన్ని వదిలేసింది. కానీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ కు సహకరించిన చైనా .. తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

India-Pakistan Truce Sources Deny China s Third-Party Intervention Claim

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సైనిక వివాదంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా తాజాగా కొత్త వాదన తెరపైకి తెచ్చింది. దీనికి భారత్ ఇవాళ కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాల్పుల విరమణ కోరింది పాకిస్తాన్ అని, ఇందులో మూడో పక్షం మధ్యవర్తిత్వం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మరోసారి తేల్చిచెప్పాయి. భారత్-పాక్ యుద్ధాన్ని మధ్యవర్తిత్వంతో ఆపినట్లు ట్రంప్ చేసిన వాదన తరహాలోనే చైనా వాదన ఉండటంపై కేంద్రం గుర్రుగా ఉంది.

India-Pakistan Truce Sources Deny China s Third-Party Intervention Claim

భారత్-పాక్ యుద్ధంలో మధ్యవర్తిత్వంపై తమ యొక్క వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదని తేల్చేసింది. మూడవ పక్షం జోక్యం ఉండకూడదని భారత్ ఎల్లప్పుడూ వాదించిందని గుర్తుచేసింది. పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ భారత డైరెక్టర్ జనరల్ ను కాల్పుల విరమణ కోరడంతోనే తాము వెనక్కి తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎన్డీటీవీకి తెలిపాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+