వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపెక్‌ తీరుపై భారత్‌ సీరియస్‌-సౌదీ నుంచి చమురు దిగుమతుల్లో కోతకు రెడీ

|
Google Oneindia TeluguNews

చమురు సరఫరా దేశాల సమాఖ్య ఒపెక్‌పై భారత్‌ సీరియస్‌ అయింది. కరోనా తర్వాత దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధల పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చమురు సరఫరా చేస్తున్న విజ్ఞప్తుల్ని ఒపెక్ పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో వారి నుంచి దిగుమతి చేసుకునే చమురు కోటాలో భారీగా కోత విధించాలని నిర్ణయం తీసుకుంది.

18వ రోజు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు ... స్థిరంగా చమురు ధరలు ఉన్న కారణం ఇదేనా !! 18వ రోజు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు ... స్థిరంగా చమురు ధరలు ఉన్న కారణం ఇదేనా !!

కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భారత్‌కు చెందిన చమురు రిఫైనరీలు సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురులో భారీగా కోతలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. రేపోమాపో అధికారికంగా నిర్ణయం ప్రకటించేందుకు చమురు రిఫైనరీలు సిద్ఘంగా ఉన్నాయి. చమురు దిగుమతుల విషయంలో మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న కేంద్రం నిర్ణయంలో భాగంగానే చమురు రిఫైనరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

india readies saudi oil import cut as stand-off escalates- report

ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్ధాన్‌ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీ మరియు పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ వచ్చే మే నెల నుంచి 10.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురు దిగుమతుల్లో కోత విధించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌ రోజుకు 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఈ ఐదు రిఫైనరీలు కలిపి 60 శాతం చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. బ్యారెళ్లలో చూస్తే నెలకు ఈ ఐదు రిఫైనరీలు 14.7 నుంచి 14.8 బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిలో 10.8 మిలియన్‌ డాలర్ల కోత పెడితే ఒపెక్‌ దేశాలకు భారీ షాక్‌ తప్పదు.

English summary
indian state oil refiners are planning to cut oil imports from saudi arabia amid stand-off between central govt and opec on escalating supplies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X