పాకిస్థాన్ మొత్తం బూడిద అయ్యే ఆయుధం.. భారత్ కు రష్యా బిగ్ గిఫ్ట్..

భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకుంటోంది. ఈ మేరకు భారత్ కు చిరకాల మిత్రుడైన రష్యా నుంచి అత్యాధునిక S 400 గగనతల వ్యవస్థలు భారత్ కు చేరేందుకు రెడీగా ఉన్నాయి. మే నెలాఖరు నాటికి భారత్ కు నాలుగో యూనిట్ రానున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రష్యా నుంచి ఇందుకు సంబంధించిన నౌకలు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఇక గతేడాది ఏప్రిల్ 22 న భారత్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ ఉగ్రమూకలు మారణకాండ జరిపిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

అయితే భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ యుద్ధంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన వేలాది డ్రోన్, క్షిపణులను S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని గాల్లోనే ధ్వంసం చేసింది. దాంతో పాకిస్థాన్ పై భారత్ విజయఢంకా మోగించింది. అయితే S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు చెందిన నాలుగో యూనిట్ కూడా త్వరలోనే భారత్ కు రానుంది. దీంతో పాకిస్థాన్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ నాలుగో యూనిట్ ను రాజస్థాన్ లోని పాకిస్థాన్ బోర్డర్ వద్ద మోహరించనున్నట్లు సమాచారం. దాంతో పాకిస్థాన్ సరిహద్దులో భారత వైమానిక రక్షణ మరింత బలోపేతం కానుంది.

మరోవైపు S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు చెందిన ఐదో యూనిట్ ఈ ఏడాది నవంబర్ నాటికి భారత సైన్యంలో చేరనున్నట్లు స్పష్టం అవుతోంది. దీనిని చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో మోహరించనున్నట్లు సమాచారం. అంతేకాక మరో 5 S 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా రష్యా నుంచి భారత్ మున్ముందు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఆమోదం లభించినట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ వద్ద S 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంఖ్య 10 కు చేరనుంది. ఇది పాకిస్థాన్, చైనాకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.

India Receives Fourth S-400 Unit from Russia System Deployed Along Pakistan Border fourth S400 unit

ఇవే కాకుండా రష్యానుంచి పాంట్ సిర్ అనే మరో అత్యాధునిక రక్షణ వ్యవస్థను కూడా భారత్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటిలో కొన్ని రష్యా నుంచి కొనుగోలు చేసి.. మరికొన్నింటిని టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మనదేశంలోనే తయారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+