దేశంలో కోవిడ్ కల్లోలం- 24 గంటల్లో 2.68 లక్షల కేసులు-16.66 శాతానికి పాజిటివిటీ
భారత్ లో కోవిడ్ కల్లోలం అంతకంతకూ పెరుగుతుంది. పండుగల సీజన్ కావడం, ఓమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతోంది. గత 24 గంటల్లోనే ఏకంగా 2.68 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6041 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ గణాంకాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ వెల్లడించింది.
ఇప్పటిదాకా నమోదైన కోవిడ్ కేసుల్లో 3.85 శాతం యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అలాగే జాతీయ స్దాయిలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి శాతం 94కు తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా నమోదు కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 12.84 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 156.02 కోట్లు దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో పోలిస్తే ఓమిక్రాన్ వైరస్ కేసుల వ్యాప్తి ఆశించినంతగా లేకపోవడం ఒక్కటే ఊరటగా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వైరస్ మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు విశ్లేషణలు చేసినా భారత్ లో మాత్రం అలా జరగడం లేదు. దీంతో సాధారణ కోవిడ్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. పండుగల సీజన్ కావడంతో కోవిడ్ ఆంక్షలను జనం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రెండు రోజులు పండుగలు ముగియానే తిరిగి ప్రభుత్వాలు ఆంక్షల్ని కఠినతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications