ఆల్‌టైమ్ హై: కరోనా కాటు: మూడున్నర లక్షల కొత్త కేసులు: 2,767 మంది మరణాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా..ఊహకు కూడా అందని విధంగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్కరోజు దాటేటప్పటికీ వేల సంఖ్యలో జమ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఇలా ఏ ఒక్క రాష్ట్రం కూడా మినహాయింపు లేదు. కరోనా మరణాల్లోనూ అదే జోరు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా మృతుల సంఖ్య రికార్డవుతోంది.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,49,691 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది మరణించారు. 2,17,113 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. ఇందులో 1,40,85,110 మంది కోలుకున్నారు. 1,92,311 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751కి చేరింది. కరోనా యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో చేరుకోవడం ఇంతకుముందెప్పుడు జరగలేదు.

India records 349691 Covid 19 positive case and 2767 deaths in last 24 hours

ఆసుపత్రులు, క్లినిక్‌లు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు కన్నుమూస్తున్నారు. 29 లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉండటం వల్ల వారికి చికిత్స అందించడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు చాలట్లేదు. దీనితో రైల్వే మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. రైళ్ల బోగీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది. అవసరం ఉన్న రాష్ట్రాలకు వాటిని పంపిస్తోంది. తాజాగా- 20 బోగీలతో కూడిన రైలు ఈ ఉదయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చేరుకుంది. ఈ బోగీల్లో పేషెంట్లకు చికిత్స అందిస్తారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 14,09,16,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది.కరోనా పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో చెలరేగిపోతోండటంతో పలు రాష్ట్రాలు రాత్రివేళ కర్ఫ్యూను విధించాయి. వారంతపు రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కర్ణాటక, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ వంటి పలు చోట్ల పాక్షిక లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది. ఏపీ, తెలంగాణల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+