వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది . రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారత దేశంలో పరిస్థితి దారుణంగా తయారయింది. నిన్నటికి నిన్న లక్షకుపైగా నమోదైన కేసులు, నేడు కాస్త నెమ్మదించాయి . ఇక మరనాలలోనూ కాస్త తగ్గుదల కనిపించింది .

తెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలుతెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలు

 గత 24 గంటల్లో భారత్‌లో 96,982 కరోనావైరస్ కేసులు

గత 24 గంటల్లో భారత్‌లో 96,982 కరోనావైరస్ కేసులు

ఇక తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో 96,982 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 50,143 కరోనా బారిన పడిన వారు కోలుకోగా , గడచిన ఒక రోజులో 446 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులను చూస్తే 1,26,86,049, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీలు 1,17,32,279 కాగా , ప్రస్తుతం దేశంలో ఉన్న క్రియాశీల కేసులు 7,88,223 గా ఉంది.

మహారాష్ట్రలో తాజాగా 47,288 కరోనా కొత్త కేసులు

మహారాష్ట్రలో తాజాగా 47,288 కరోనా కొత్త కేసులు


ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న మరణాల సంఖ్య 1,65,547 గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన వ్యాక్సినేషన్ కార్యక్రమం 8,31,10,926 కు చేరుకుంది.

దేశంలోనే కరోనా బారిన పడిన అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది .మహారాష్ట్రలో తాజాగా 47,288 కరోనా కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.23 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు గా తెలుస్తుంది.

25 ఏళ్ళపైన వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని పీఎం ను కోరిన మహా సీఎం

25 ఏళ్ళపైన వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని పీఎం ను కోరిన మహా సీఎం


మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపద్యంలో 25 సంవత్సరాల వయసున్న వారిని సైతం వ్యాక్సిన్స్ ఇప్పించవలసిందిగా నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి యువత వేగంగా విస్తరింప చేయకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. దేశంలో తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు నేపద్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నాడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.

గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో కరోనా పరిస్థితి సమీక్షించనున్న పీఎం మోడీ

గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో కరోనా పరిస్థితి సమీక్షించనున్న పీఎం మోడీ

మార్చి 17 న ఆయన ముఖ్యమంత్రులతో చివరిసారిగా మాట్లాడారు. ఈ సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మరియు విపరీతంగా పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడానికి త్వరితగతిన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన అన్ని రాష్ట్రాల సీఎంల కు పిలుపునిచ్చారు.
భారత దేశంలో కరోనా రక్కసి ఊహించని విధంగా పెరిగిపోతోంది ఏప్రిల్ రెండో వారంలో కరోనా పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెరుగుతున్న కేసులు

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెరుగుతున్న కేసులు

పెరుగుతున్న కోవిడ్ కేసుల ఆందోళన తీవ్రత మధ్య మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది . ఇక దేశ రాజధాని ఢిల్లీ లో కూడా కరోనా పంజా విసురుతుంది. ఇటు తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , సామజిక దూరం , కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి .

English summary
India on Tuesday registered 96,982 fresh coronavirus cases, 50,143 discharges, and 446 deaths in the last 24 hours, as per the Union Health Ministry.Total cases: 1,26,86,049, Total recoveries: 1,17,32,279, Active cases: 7,88,223, Death toll: 1,65,547, Total vaccination: 8,31,10,926
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X