Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో పోటెత్తుతున్న కరోనా కేసులు .. గత 24గంటల్లో 1,45,384 కేసులతో రికార్డ్ బ్రేక్ , 794 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగిస్తోంది. 10 లక్షలు దాటిన క్రియాశీల కేసులతో భారతదేశంలో కరోనా కలవరాన్ని పెంచుతోంది. ఊహించని విధంగా పెరుగుతున్న కేసుల తీరు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,45,384 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు భారతదేశం రోజువారీ కేసులలో ఇంత భారీగా కేసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి.

గత 24 గంటల్లో 794 మంది మృతి

గత 24 గంటల్లో 794 మంది మృతి

ఇక భారతదేశం తన రోజువారి కేసులలో రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా పెరిగిన కొత్త కేసులతో పాటు, భారతదేశంలో మొత్తం 1,32,05,926 కు చేరుకుందని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో కరోనా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది.

గత 24 గంటల్లో 794 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,68,436 కు చేరుకుంది.

10 లక్షల మార్కును దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

10 లక్షల మార్కును దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది . ఇది మొత్తం కేసులలో 7.93 శాతం. గత ఐదు రోజుల్లో 6.16 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 3,335 మంది మరణించారు. గత 24 గంటల్లో భారతదేశం 77,567 డిశ్చార్జెస్ నమోదు చేసింది.

మార్చి 31న 53,480 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది . గత 24 గంటల్లో నమోదైన మరణాల సంఖ్య కూడా మార్చి 31 తరువాత అత్యధికం.

రెండు నెలల్లో 9 లక్షల క్రియాశీల కేసులు నమోదు కావడంతో ఆందోళన

రెండు నెలల్లో 9 లక్షల క్రియాశీల కేసులు నమోదు కావడంతో ఆందోళన

ఏప్రిల్ 5 న 1,03,558 తాజా ఇన్ఫెక్షన్లు ఉండగా, ఏప్రిల్ 7 న 1,15,736 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఏప్రిల్ 8 మరియు 9 తేదీలలో వరుసగా 1,26,789 మరియు 1,31,968 నమోదయ్యాయి.

ఇక నేడు ఏకంగా లక్షా 46 వేల వరకు కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి . విపరీతంగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 12 న 1,25,926 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉండగా, కేవలం రెండు నెలల్లో 9 లక్షల క్రియాశీల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

 కరోనా కట్టడికి సరికొత్త వ్యూహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కరోనా కట్టడికి సరికొత్త వ్యూహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఎందుకంటే మహమ్మారి వేగంగా వ్యాపిస్తుందని ఇది సూచిస్తుంది . ఏది ఏమైనా ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతదేశం మరింత దయనీయమైన స్థితికి చేరుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి సరికొత్త వ్యూహాలతో ఎక్కడ ప్రభావం ఉంటే అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేలా కఠిన నిబంధనలు విధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+