వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస అధికారి స్పందన-తప్పుబట్టిన భారత్-అసమంజసమని వెల్లడి

|
Google Oneindia TeluguNews

2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో బాధితుల తరఫున న్యాయపోరాటం చేసిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను గుజరాత్ ఏఠీఎస్ అరెస్టు చేసింది. ఆమె అరెస్టు కక్షసాధించేనంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఐరాస మానవ హక్కుల విభాగం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. హక్కులు కాపాడుకోవడం నేరమేమీ కాదని తెలిపింది. దీనిపై భారత్ ఇవాళ స్పందించింది.

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మరో ఇద్దరు వ్యక్తుల్ని భారత్ లో పోలీసులు ఇటీవల అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం చేసిన వ్యాఖ్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది.

india refused UN officialss statement on Teesta Setalvad arrest, Says Unwarranted
ఐరాస మానవ హక్కుల అధికారి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొంది. అళాగే భారతదేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునేలా ఉన్నాయని తెలిపింది. భారతదేశంలోని అధికారులు చట్ట ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏర్పాటు చేయబడిన న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేర్కొంది.అటువంటి చట్టపరమైన చర్యలను క్రియాశీలత కోసం హింసగా పేర్కొనడం తప్పుదారి పట్టించేదని, ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.

సామాజిక కార్యకర్త సెతల్వాద్‌ను అరెస్టు చేయడం, నిర్బంధించడంపై యూఎన్ మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం ఆందోళన తాజాగా వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చింది.

తీస్టా సెతల్వాద్ తో పాటు ఇద్దరు మాజీ పోలీసు అధికారులను అరెస్టు చేయడం , నిర్బంధించడం పట్ల తాము చాలా ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. అలాగే వారిని వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చింది. 2002 #గుజరాత్ అల్లర్ల బాధితులకు తిరిగి హింసించరాదని సూచించింది. దీనిపై భారత్ స్పందించింది.

English summary
central govt has refused un official's allegations on social activist teesta setalvad's recent arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X