వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్‌పై పాకిస్థాన్‌లో చైనా మంత్రి వ్యాఖ్యలు: ఇతరుల జోక్యం వద్దంటూ తేల్చేసిన భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ అంతర్గత విషయమని భారత్ బుధవారం పునరుద్ఘాటించింది. పాకిస్థా‌న్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన ప్రసంగంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన "అవసరం లేని సూచన"ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అంశాలు పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారాలు. చైనాతో సహా ఇతర దేశాలకు వ్యాఖ్యానించడానికి ఎటువంటి హక్కు లేదు. భారతదేశం తమ అంతర్గత సమస్యలపై బహిరంగ తీర్పుకు దూరంగా ఉందని వారు గమనించాలి అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. చైనా విదేశాంగ మంత్రి ప్రసంగంపై ప్రశ్నలకు సమాధానంగా మీడియాకు వెల్లడించారు.

 India Rejects Chinese Ministers Remarks In Pakistan On Jammu And Kashmir

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఇన్ పాకిస్థాన్‌లో తన ప్రారంభ ప్రసంగంలో వాంగ్.. కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. "కాశ్మీర్‌పై, ఈ రోజు మన ఇస్లామిక్ స్నేహితులలో చాలా మంది పిలుపులను మేము మళ్లీ విన్నాము. చైనా అదే ఆశను పంచుకుంటుంది," అని వాగ్ పేర్కొన్నారు.

వాంగ్ యీ వ్యాఖ్యలను న్యూఢిల్లీ తిరస్కరించడం, ఆయన రెండు రోజుల్లోపు న్యూఢిల్లీకి వచ్చే అవకాశం ఉండటంతో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది.

జమ్మూ కాశ్మీర్ విషయంలో తన వ్యూహాత్మక మిత్రదేశం -- పాకిస్తాన్ వైఖరికి చైనా పదే పదే తన మద్దతును పునరుద్ఘాటించింది. గత నెలలో, చైనా-పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ-కాశ్మీర్ విషయంలో చేసిన సూచనలను భారతదేశం తిరస్కరించింది, ఈ ప్రాంతం అలాగే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో "ఉన్నాయి, అలాగే ఉంటాయి" అని నొక్కి చెప్పింది.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య బీజింగ్‌లో జరిగిన చర్చల తరువాత ఫిబ్రవరి 6న సంయుక్త ప్రకటన విడుదలైంది. భారతదేశం ఎప్పుడూ ఇలాంటి సూచనలను తిరస్కరిస్తూనే ఉంటుందని, మన వైఖరి చైనా, పాకిస్థాన్‌లకు బాగా తెలుసునని బాగ్చి అన్నారు.

గత ఏడాది జులైలో, జమ్మూ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు చైనా తన మద్దతును పునరుద్ఘాటించింది, పరిస్థితిని క్లిష్టతరం చేసే ఏ ఏకపక్ష చర్యను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. కాగా, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని భారత్.. చైనా, పాక్ దేశాలకు తేల్చి చెప్పింది.

English summary
India Rejects Chinese Minister's Remarks In Pakistan On Jammu And Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X