కరోనా ఉప్పెన- లాక్ డౌన్ తప్పదా: 24 గంటల్లో 1.16 లక్షల కేసులు : 200 రోజుల తరువాత..!!
భారత్ లో మరోసారి కరోనా ఉప్పెనలా మారుతోంది. తగ్గిందని భావిస్తున్న వేళ.. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి తిరిగి వేగంగా పెరుగుతోంది. 200 రోజుల సమయంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 1,16,836 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీని ద్వారా భారత్ లో మొత్తం కేసులు 3,52,25,699 కి చేరింది. ఏడు నెలల కాలంలో తొలి సారి లక్ష కేసుల మార్కును దాటింది. చివరగా జూన్ 6న 1,01,209 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఇదే అత్యధికం.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం
గురువారం మహారాష్ట్రలో 36,625 కొత్త కేసులు నమోదు కాగా.. పశ్చిమ బెంగాల్ లొ 15,421...ఢిల్లీలో 15,097 కేసులు రిజిస్టర్ అయ్యాయి. గురువారం వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా 2,630 గా ఉండగా.. ఒక్క రోజులో అవి మరో 495 పెరిగినట్లు ఆరోగ్య శాఖ నిర్దారించింది. వీటిల్లో మహారాష్ట్రలో 797, ఢిల్లీలో 497, రాజస్థాన్ లో 236, కేరళ లో 280, కర్ణాటక లో 226, గుజరాత్ లో 204, తమిళనాడులో 121 నమెదైనట్లు ప్రకటించారు. ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కేంద్రం రాసిన లేఖలో తమిళనాడు..పంజాబ్.. ఒడిశా..ఉత్తర ప్రదేశ్.. ఉత్తరాఖండ్.. మేఘాలయ.. మిజోరాం.. జమ్ము..బీహార్ లను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో హోం ఐసోలేషన్ లో ఉన్న వారి విషయంలో జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పైనా కేంద్రం సూచనలు చేసారు. జిల్లా - మండల స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని.. పరీక్షా కేంద్రాలతో పాటుగా అంబులెన్సులు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కంట్రోల్ రూముల్లో అవసరమైన వైద్య సిబ్బంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాని సూచించింది. గుజరాత్ లో 4,213 కేసులు రిజిస్టర్ కాగా, మొత్తం కేసుల సంఖ్య 14,346 కు చేరింది. అందులో 28 మంది వెంటిలేటర్ పైన ఉన్నారు.

కంట్రోల్ రూంల ఏర్పాటుపై మార్గదర్శకాలు
ఇప్పటి వరకు గుజరాత్ లో 204 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఒడిశాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. కరోనా కేసులు కొత్తవి 1,897 రిజిస్టర్ కాగా, ఖోర్దా జిల్లాలోనే 669 కేసులు గుర్తించారు. అక్కడ 14 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసారు. ఏపీలో 547 కొత్తగా వైరస్ కేసులను గుర్తించారు. ఇది 71 రోజుల్లో అధిక కేసులు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 కేసులు ఉన్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో 5,031 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, అందులో బెంగుళూరులోనే 4,324 కేసులు ఉన్నాయి, అదే విధంగా 226 ఒమిక్రాన్ కేసులు ట్రేస్ అయ్యాయి.

సీఎంలతో ప్రధాని కీలక సమావేశం
కేరళలో 4,649 కరోనా కేసులు గుర్తించగా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య 280కి చేరింది. అస్సాంలో 844 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి, రెండు మరణాలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 32 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, అక్కడ మొత్తం కేసుల సంఖ్య 55,407కు చేరింది. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వర్చ్యువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. కేసులు ఎక్కువగా ఉండటంతో.. ముఖ్యమంత్రుల సూచన లు తీసుకోవటంతో పాటుగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications