దేశంలో తొలి కరోనా కొత్త వేరియంట్ కలకలం: ముంబైలో వెలుగులోకి ‘ఒమిక్రాన్ ఎక్స్‌ఈ’ కేసు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ వెలుగుచూటం కలకలం రేపుతోంది. భారతదేశం బుధవారం కొత్త కరోనావైరస్ వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసును నివేదించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఈ కొత్త కోవిడ్ వేరియంట్ మొదట యూకేలో కనుగొనబడింది.
తాజా సెరో సర్వే నివేదికలో, BMC బుధవారం నాడు XE వేరియంట్ ఒక కేసు, కప్పా వేరియంట్ ఒక కేసును కనుగొన్నట్లు తెలిపింది. సెరో సర్వే కోసం నమూనాలను పంపిన మొత్తం 230 మంది రోగులలో, 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ, రోగులలో ఎవరికీ ఆక్సిజన్ మద్దతు లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని నివేదిక వెల్లడించింది.
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 1,086 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇవి 291 అధికం. కాగా, మహమ్మారి ధాటికి మరో 71మంది మరణించారు. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు.. 0.03 శాతంగా ఉన్నాయి.

రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 1,198 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా యాక్టివ్ కేసులు: 11,871
మరణాలు: 5,21,487
మొత్తం కేసులు: 43,030,925
రికవరీలు: 4,24,97,567
మరోవైపు, దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 15,49,699 మందికి మంగళవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.04 కోట్లకు చేరింది. కాగా, మంగళవారం 4,81,374 కరోనా టెస్టులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications