Coronavirus:20 రోజుల్లో 50శాతం మేరా పెరిగిన పాజిటివ్ కేసులు..మరణాల సంఖ్య కూడా..!

ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారిన 1.5 కోట్లు మంది పడగా ఇక ఈ మహమ్మారి బారిన పడి 6 లక్షలకు పైగా మృతిచెందారు. ఇక మనదేశంలో అయితే రోజురోజుకు కరోనావైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ తర్వాత కేసుల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. అదే స్థాయిలో మరణాల సంఖ్య నమోదవుతోంది.

గత 24 గంటల్లో దేశంలో 37,148 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 587 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. జూలై 1వ తేదీ నాటికి 6.05 లక్షలుగా ఉన్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య , జూలై 20వ తేదీ నాటికి 11.54లక్షలకు పాజిటివ్ కేసులు పెరిగాయి. అంటే 20 రోజుల్లో 48శాతం మేరా కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక తాజాగా పెరిగిన కేసులతో దేశంలో మొత్తం 11,55,191 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 4,02,529 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 7,24,578 ఉండగా 28084 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

India Reports nearly 50% Covi-19 positive cases in July alone

ఇక తాజాగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ముందురోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. ముందు రోజు 37,009 పాజిటివ్ కేసులు నమోదు కాగా 593 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 28వేల మార్కును తాకింది. ఇక ఇప్పటివరకు 1,43,81,303 శాంపిల్ టెస్టులు నిర్వహించడం జరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో గత మూడురోజులుగా తగ్గుదల కనిపిస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. సోమవారం రోజున ఢిల్లీలో 954 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1.23 లక్షలకు చేరుకుంది. మూడంకెల సంఖ్య ఢిల్లీలో నమోదు కావడం ఇదే తొలిసారని రణదీప్ గులేరియా చెప్పారు.

ఇక పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని త్వరలో అది తారాస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని గులేరియా చెప్పారు. అంతేకాదు జాతీయ స్థాయిలో సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని చెప్పిన గులేరియా ... స్థానికంగా ఇప్పటికే సామాజిక వ్యాప్తి కనిపిస్తోందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+