చాలా ఎక్కువైంది!: ప్రధాని మోడీకి షాకిచ్చిన అమెరికా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు పైన అమెరికా తాజాగా షాకిచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక 7.5 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో చెప్పారు. దీనిపై అగ్రరాజ్యం సెటైర్లు వేసింది. చెప్పడమే తప్ప నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమీ లేవని తెలిపింది.

అమెరికా విదేసాంగ శాఖ 'ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ స్టేట్‌మెంట్స్ ఫర్ 2016' పేరిట విడుదల చేసిన నివేదికలో పైవిధంగా వ్యాఖ్యానించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఫరవాలేదని చెప్పింది.

India's 7.5 per cent growth rate may be overstated: US

అయితే, మిగతా విషయాలు, ప్రత్యేకించి ఆర్థిక సంస్కరణ అమలులో అనుకున్న వేగం లేదని పేర్కొంది. తాను ప్రతిపాదిస్తున్న సంస్కరణలను పార్లమెంటులో ఆమోదింప చేసుకునే విషయంలో ప్రధాని మోడీ సర్కార్ విఫలమవుతోందని పేర్కొంది.

భూసేకరణ బిల్లు ఆమోదం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా తన నివేదికలో ఉదహరించింది. భూసేకరణ బిల్లు వి,యంలో రాజకీయ పార్టీల మద్దతు పొందలేకపోయిందని పేర్కొంది. ప్రపంచటంలో భారత్ అత్యంత వేగవంగా అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పవచ్చునని, కానీ 7.5 శాతం వృద్ధి రేటు మరీ ఎక్కువగా చెప్పినట్లు అభిప్రాయపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Underlining that India's 7.5 percent growth rate may be "overstated", the US has said the Narendra Modi government has been "slow" to match its rhetoric in economic reforms even as it appreciated measures taken by it in areas like bureaucracy and easing FDI restrictions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి