Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆప్ఘన్ లో భారత్ వ్యూహమిదే-తాలిబన్లతో చర్చలు ?-పాకిస్తాన్ కు చెక్-కేంద్రం సంకేతాలు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటోన్న భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది ? ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న అంశం ఇదే. ఎందుకంటే ఉపఖండంలో జరిగే ప్రతీ కీలక పరిణామం పశ్చిమాసియాలో శాంతిని నిర్దేశించే పరిస్ధితులు ఉండటంతో భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం తీసుకునే నిర్ణయాలు కూడా అంతే కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆప్ఘన్ లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన భారత్ ఇప్పుడు ఆ దేశంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో ఎలా వ్యవహరించబోతోందన్న ఆసక్తి సర్వత్రా పెరుగుతోంది.

 తాలిబన్ల దురాక్రమణ

తాలిబన్ల దురాక్రమణ

నిన్న మొన్నటి వరకూ బారత్ కు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న ఆప్ఘనిస్తాన్ పై తాలిబన్లు దురాక్రమణ చేసి పట్టు సంపాదించారు. త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకూ సిద్దమవుతున్నారు. దీనికి పాకిస్తాన్ కూడా అండగా నిలుస్తోంది. కొత్త తాలిబన్ ప్రభుత్వంలో మంత్రుల్ని కూడా నిర్ణయించే పరిస్ధితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. దీంతో సహజంగానే ఈ పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. తాలిబన్ల కొత్త సర్కార్ లో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన సిరాజుద్దీన్ హక్కానీకి స్ధానం కల్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 ఆప్ఘన్ పై పట్టు కోల్పోయిన భారత్

ఆప్ఘన్ పై పట్టు కోల్పోయిన భారత్

ఆప్ఘన్ పై తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో అక్కడ రాజకీయాల్ని శాసించే విషయంలో భారత్ పూర్తిగా పట్టు కోల్పోయింది. ముఖ్యంగా అక్కడి ప్రజా ప్రభుత్వం ఉన్న కాలంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి మరీ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసిన భారత్.. ఇప్పుడు ఏమీ చేయలేక చోద్యం చూడాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఆప్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొస్తే చాలన్న స్ధితికి భారత్ చేరిపోయింది. ఈ పరిణామాలు పొరుగుదేశం పాకిస్తాన్ కు సైతం వరంగా మారుతున్నాయి. ఇదే అదనుగా భారత్ ను టార్గెట్ చేసేందుకు తాలిబన్లతో కలిసి పాకిస్తాన్ వ్యూహరచన చేస్తోంది. దీంతో భారత్ కూడా కౌంటర్ వ్యూహం పన్నాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి.

 ఆప్ఘన్ లో భారత్ కౌంటర్ వ్యూహం

ఆప్ఘన్ లో భారత్ కౌంటర్ వ్యూహం

ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్ధితుల్లో తాము గతంలో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు, పార్లమెంటు సహా ఇతర కట్టడాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో భారత్ పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు వృథాగా మారబోతున్నాయి. అదే సమయంలో అక్కడి ప్రజల్ని సైతం రక్షించేందుకు భారత్ రచిస్తున్న వ్యూహాలు కూడా పూర్తిగా సఫలమయ్యేలా కనిపించడం లేదు. తాలిబన్లు ఇందుకు ఎంతవరకూ సహకరిస్తారన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఓవైపు పాకిస్తాన్ నుంచి తాలిబన్లపై పెరుగుతున్న ఒత్తిడి కూడా భారత్ కు ఇబ్బందికరంగా మారబోతోంది. దీంతో భారత్ కౌంటర్ వ్యూహాలకు పదును పెడుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

 ఆప్ఘన్ లో భారతీయులకు ముప్పు

ఆప్ఘన్ లో భారతీయులకు ముప్పు

ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక భారత్ ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించబోమంటూ సంకేతాలు ఇస్తున్నా అధికారికంగా మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన భారతీయులే. కేంద్రం తొందరపడి ఎలాంటి ప్రతికూల ప్రకటనలు చేసినా ఆ ప్రభావం ఆఫ్ఘన్ లో చిక్కుకున్న భారతీయులపై పడే ప్రమాదం ఉంది. దీంతో కేంద్రం వ్యూహాత్మక సంయమనం పాటిస్తోంది. తాలిబన్ల విషయంలో అంతర్జాతీయ సమాజంతో చర్చలు జరుపుతున్నా.. బహిరంంగ ప్రకటనలకు మాత్రం కేంద్రం నిరాకరిస్తోంది. అదే సమయంలో భవిష్యత్ వ్యూహాలపై మాత్రం సంకేతాలు ఇస్తోంది.

 తరలింపు పూర్తి కాగానే వ్యూహం అమలు

తరలింపు పూర్తి కాగానే వ్యూహం అమలు

ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్న భారత్ ప్రత్యేక ఎలక్ట్రానిక్ వీసాల జారీతో పాటు పలు చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా వీరిని స్వదేశానికి చేర్చడంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు కేంద్రం చెబుతోంది. ఈ తరలింపు త్వరలో పూర్తి కావచ్చని భావిస్తున్న కేంద్రం.. ఆ తర్వాతే తమ వ్యూహం బయటపెడతామని వెల్లడిస్తోంది. అంటే తరలింపు లోపు తాము తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేసినా, కొత్త వ్యూహాల్ని తెరపైకి తెచ్చినా అక్కడి భారతీయులకు అది ముప్పుగా మారవచ్చనే భయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఆప్ఘన్ లో పరిస్దితుల్ని నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగమంత్రి జై శంకర్ చెప్తున్నారు.

 తాలిబన్లతో చర్చల ప్రతిపాదన

తాలిబన్లతో చర్చల ప్రతిపాదన

ఆప్ఘనిస్తాన్ లో పాగా వేసిన తాలిబన్లతో చర్చల విషయంలో భారత్ ముందుకు ఎన్నో ప్రతిపాదనలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో శాంతి కోరుకుంటున్న పలు దేశాలు ఈ ప్రతిపాదనల్ని భారత్ ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది తాలిబన్లతో శాంతి చర్చలు. ఈ చర్చలు కూడా ఆప్ఘనిస్తాన్ లో పౌరుల క్షేమంతో పాటు భారత్ మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపడితే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ భారత్ మాత్రం తాలిబన్లతో చర్చలపై మాత్రం వ్యూహాత్మక మౌనం వహిస్తోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి భారతీయుల తరలింపు పూర్తయితే కానీ ఏమీ చెప్పలేమని సంకేతాలు ఇస్తోంది.

 పాకిస్తాన్ టార్గెట్ గానే ఆఫ్ఘన్ వ్యూహం

పాకిస్తాన్ టార్గెట్ గానే ఆఫ్ఘన్ వ్యూహం

ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లతో చర్చలు లేదా ఇతరత్రా సంబంధాల విషయంలో భారత్ ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం మాత్రం పాకిస్తాన్ ను దృష్టిలో పెట్టుకునే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాలిబన్ల ప్రభుత్వం పాకిస్తాన్ కన్నుసన్నల్లో నడిచే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ను టార్గెట్ చేస్తూనే ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని బుజ్జగించేందుకు భారత్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఆప్ఘన్ పౌరులకు మేలు చేసేలా ఈ వ్యూహం ఉండబోతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో భారతీయుల తరలింపు పూర్తయిన తర్వాత కేంద్రం తీసుకోబోయే నిర్ణయం పశ్చిమాసియాలో శాంతితో పాటు భారత్ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+