కరోనా కల్లోలం: దేశంలో దిగజారుతోన్న పరిస్థితి, పెరుగుతోన్న మరణాలు.. థర్డ్ వేవ్..
దేశంలో కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అని చెబుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ ప్రొ వీసీ, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విపిన్ శ్రీ వాత్సవ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తోందని.. జూలై 4 నుంచి మొదలవుతుందని ఆయన ఇంతకుముందే అంచనా వేశారు.
డాక్టర్ విపిన్ చెప్పినట్టు కరోనా కేసులు పెరిగాయని.. అలాగే జూలై 4వ తేదీ నుంచి మరణాలు కూడా పెరిగాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. కరోనా కేసులు పెరిగి పరిస్థితి మరింత దిగజారింది. మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ థర్డ్ వేవ్‌కి సంకేతాలు అని విపిన్ అంచనా వేశారు. ఆయన చెప్పినట్టే ప్రస్తుతం జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుదల/ మరణాల హెచ్చుకు సంబంధించి విపిన్ వివిధ శాస్త్రీయ కోణాలను వివరించారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications