ఇలాగే ముందుకు: మోడీ సర్కారులో ఉత్సాహాన్ని నింపిన ప్రపంచ బ్యాంక్, 7.3శాతం గ్రోత్
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారులో కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రపంచ బ్యాంక్. నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.
ఆ తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. అదే జీఎస్టీ అమలు. జీఎస్టీతో దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నప్పటికీ.. ఒక్కసారిగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ నేపథ్యంలోనే భారత వృద్ధిరేటుపై ప్రపంచ బ్యాంక్ సానుకూలంగా స్పందించింది.

అత్యంత వేగమైన అభివృద్ధి
భారతదేశంలో అమలవుతున్న సంస్కరణలు దేశ వృద్ధికి ఎంతో తోడ్పడతాయని పేర్కొంది. అంతేగాక, ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తోందని భారత్‌ను కొనియాడింది. ‘భారత ప్రభుత్వం అద్భుతమైన సంస్కరణలను అమలు చేస్తోంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ముందు వరుసలో నిలిచింది' అని ప్రపంచ బ్యాంక్ మంగళవారం పేర్కొంది.

7.30శాతం వృద్ధిరేటుతో..
అంతేగాక, భారత వృద్ధిరేటు 2018లో 7.3శాతంగా ఉండనుందని వెల్లడించింది. ఆ తర్వాతి రెండు సంవత్సరా(1919, 1920ల్లో వృద్ధిరేటు 7.5గా ఉండనుందని పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీతో ఏర్పడిన ఆటుపోట్లను తట్టుకొని 2017లో 6.7శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ 2018ను వాషింగ్టన్‌లో మంగళవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది.

రాబోయే కాలం భారత్‌దే
‘వచ్చే దశాబ్ద కాలంలో ఇతర అభివృ చెందుతున్న దేశాలకంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేయనుంది. అందుకు స్వల్పకాలిక ఫలితాలను పట్టించుకోనవసరం లేదు. రాబోయే కాలంలో భారత్ పెద్ద ఎత్తున అభివృద్ధిని నమోదు చేయనుంది' అని ప్రపంచ బ్యాంక్ డెవలప్‌మెంట్ ప్రాస్పెక్ట్ గ్రూప్ డైరెక్టర్ అయ్హన్ కోస్ తెలిపారు.

వృద్ధిరేటు సానుకూలం
గత మూడు సంవత్సరాల్లో సాధించిన వృద్ధిరేటు సానుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు మంచి పెట్టుబడులకు అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. లేబర్ మార్కెట్ సంస్కరణలు మెరుగయ్యాయని, అలాగే విద్యా, ఆరోగ్యం విభాగాల్లో కూడా సంస్కరణలు బాగా అమలవుతున్నాయని ప్రశంసించారు.

అంచనాలకు మించి..
నిరుద్యోగితను తొలగించేందుకు కూడా భారత్ సంస్కరణలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడంతో ఉద్యోగావశాలు పెరుగుతున్నాయని తెలిపారు. 2018లో భారత్ అంచనాలకు మించి మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. వచ్చే పదేళ్లలో కూడా భారత వృద్ధిరేటు 7శాతానికి తగ్గబోదని స్పష్టంచేశారు.

ఆటుపోట్లు తాత్కాలికమే.. ఇలాగే ముందుకు
జీఎస్టీ అమలు చేయడం అనేది కీలక పరిణామమని, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ఆ వ్యవస్థను మరింత పటిష్టపరిచిందని కోస్ తెలిపారు. జీఎస్టీ అమలులో ఉన్న ఆటుపోట్లను భారత ప్రభుత్వం గుర్తించి అందుకు తగిన చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని అన్నారు. భారత్‌కు తమ ముందున్న సవాళ్లు ఏంటో తెలుసని అన్నారు. సంస్కరణల కారణంగా తాత్కాలిక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతుందని కోస్ తెలిపారు. ఇలాంటి సంస్కరణలు భారత వృద్ధిరేటును పెంచుతాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగాలని సూచించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications