RapidX: వందే భారత్ దిగదుడుపే: కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్‌లో తొలి సర్వీస్
న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, రాష్ట్రాల మధ్య 14 వందే భారత్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా మరిన్ని సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. రీజినల్ రైళ్లు ఇవి. దూర ప్రాంతాల మధ్య ఇవి రాకపోకలు సాగించవు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తరహాలో రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్టీఎస్) కారిడార్‌లలో మాత్రమే ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇవి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండవు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తొలి సెమీ హైస్పీడ్ ఆర్ఆర్టీఎస్ రైలు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజియన్ పరిధిలో అందుబాటులోకి రానుంది. 82 కిలోమీటర్ల కారిడార్ ఇది. ఈ రైలుకు ర్యాపిడ్ ఎక్స్ (RapidX) అని పేరు పెట్టారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఈ రైలు సర్వీసులను పర్యవేక్షిస్తుంది. దేశంలో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ కింద ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ర్యాపిడ్ ఎక్స్ అనే బ్రాండ్ నేమ్ మీదే వివిధ రీజియన్ల మధ్య దశలవారీగా ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ర్యాపిడ్ ఎక్స్ లోగోగా గ్రీన్ లీఫ్‌ను ఎంపిక చేశారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా గ్రీన్ లీఫ్‌ను లోగోగా ఎంచుకున్నారు అధికారులు. డీకార్బనైజేషన్, గ్రీన్ ఎనర్జీకి ఇది రెప్రజెంట్ చేస్తుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాహన కాలుష్యం ఏ స్థాయిలో ఉంటోందో తెలిసిన విషయమే. సాధ్యమైనంత వరకు దీన్ని నియంత్రించడంలో భాగంగా ఆర్ఆర్టీఎస్ సెమీ హైస్పీడ్ రైల్వే వ్యవస్థ తెర మీదికి వచ్చింది.
ఈ రైలు సర్వీస్ వల్ల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్‌లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ రూట్‌లో నిత్యం సంచరించే లక్షలాది వాహనాలను సంఖ్య కొంతమేరకైనా తగ్గించినట్టవుతుందని అధికారులు చెబుతున్నారు. 2025 నాటికి ప్రయాణికుల కోసం ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాదే సాహిబాబాద్- దుహై స్టేషన్ల మధ్య 17 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications