'మామ్' కానుక మోడీకి: తొలి చిత్రం పంపింది (ఫోటో)
న్యూఢిల్లీ: భారత్ బుధవారం విజయవంతంగా అంగాకరకుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం గురువారం నాడు అంగారకుడి పైన తొలి చిత్రాలను పంపించింది. మార్స్ ఆర్పిటార్ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫోటో తీసి కంట్రోల్ సెంటర్‌కు పంపించింది.

ఈ ఫోటోనే ఇస్రో వర్గాలు మామ్ ట్విట్టర్ అకౌంట్లో ఉంచాయి. దాని కింద 'ద వ్యూ ఈజ్ నైస్ అప్ హియర్' (ఇక్కడి నుంచి చూస్తే మార్స్ ఎంతో బాగుంది) అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కానుకంగా అందచేసింది.

ఇస్రో తన అఫిషియల్ స్టేట్‌మెంట్లో.. తమకు ఐదు చిత్రాలు వచ్చాయని, అవి పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్రో హైక్వాలిటీ పిక్చర్‌ను చూపించింది. దీనిని బయటకు విడుదల చేసే ముందే మోడీకి చూపించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications