ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ
భూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత్తం మానవాళికే రక్షణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాదు, నాలుగవ పారిశ్రామిక విప్లవం భారత్ లోనే పుట్టుకొస్తుందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) దావోస్ సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ.. ప్రపంచవ్యాప్తంగా 400 మందికిపైగా అగ్రశ్రేణి పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలు కంపెనీల సీఈఓలతో ప్రధాని సంభాషించారు. కరోనా విలయానికి విరుగుడుగా వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించడం ద్వారా భారత్ మనవాళిని కాపాడే బాధ్యతను నెరవేర్చిందని మోదీ పేర్కొన్నారు.

''కరోనా వైరత్ వల్ల భారత్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని, కనీసం 20 లక్షల మంది చనిపోతారని గతంలో అంచనాలు వెలువడ్డాయి. కానీ వాటిని తలకిందులు చేస్తూ, భారతీయులందరం సమిష్టిగా కరోనాపై పోరాటం చేశాం. ఇవాళ 130 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రపంచానికి ఆశ, విశ్వాసాలను కలిగించడానికే నేనీ సదస్సుకు వచ్చాను. వైరస్ బారి నుంచి భారతీయులను కాపాడుకున్నట్లుగానే.. 150కిపైగా దేశాలకు మందుల్ని, వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను, మౌలిక సదుపాయాలను అందిస్తూ యావత్ మానవాళినీ కాపాడగలుగుతున్నాం'' అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక,
ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ వేదికగా నిలుస్తుందని, ఇందుకోసం భారత్ నాలుగు పిల్లర్లతో పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందిస్తున్నదని మోదీ తెలిపారు. పారిశ్రామిక విప్లవానికి.. కనెక్టివిటీ, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ డేటాలను నాలుగు పిల్లర్లుగా భావిస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని, భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను మోదీ అభ్యర్థించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications