కేంద్రానికి షాక్... ఇలాగైతే టార్గెట్ చేరడం కష్టమే.. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై షాకింగ్ లెక్కలు...

కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు భారతీయులు అంత సుముఖంగా లేరా... వారిలో నెలకొన్న అనుమానాలు,సందేహాలు వ్యాక్సినేషన్‌కు వారిని దూరంగా ఉంచుతున్నాయా... క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చాలావరకు ప్రపంచ దేశాలు తమ జనాభాకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు లేవని బాధపడుతుంటే... భారత్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా వ్యాక్సిన్ డోసులను సిద్దం చేసినప్పటికీ... ప్రజల నుంచి స్పందన కరువవుతోంది.

5వేల వ్యాక్సిన్ డోసులు వృథా

5వేల వ్యాక్సిన్ డోసులు వృథా


తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఇప్పటివరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో దాదాపు 5వేల వ్యాక్సిన్ డోసులు వృథా అయినట్లు వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 11శాతం వ్యాక్సిన్ డోసులను వృథా చేసిన త్రిపుర ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. సాధారణంగా వ్యాక్సిన్ డోసులను గ్లాస్ వయల్స్ నుంచి బయటకు తీసిన నాలుగు గంటల్లోనే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఆ డోసులు స్వీకరించేవారు తగినంతమంది లేకపోవడంతో అవి వృథా అవుతున్నాయి.

అంతంత మాత్రమే...

అంతంత మాత్రమే...

జనవరి 16న దేశవ్యాప్తంగా తొలి విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కాగా... ఇప్పటివరకూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఎంపిక చేసిన ప్రతీ 100 మందిలో కేవలం 55 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఒకవేళ ఆరోజు షెడ్యూల్‌లో ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకునేందుకు రాకపోతే... వేరే షెడ్యూల్‌లో ఉన్నవారిని పిలిచైనా వ్యాక్సిన్ ఇవ్వాలని సిబ్బందికి సూచిస్తున్నారు. తద్వారా వ్యాక్సిన్ డోసుల వృథాను తగ్గించవచ్చునని చెబుతున్నారు.

ప్రతీ 100 మందిలో 49 మందికే...

ప్రతీ 100 మందిలో 49 మందికే...

గురువారం(జనవరి 28) నాటి సగటును పరిశీలిస్తే... ఈ ఒక్కరోజే 5 లక్షల వ్యాక్సినేషన్స్ చేపట్టగా.. ఎంపిక చేసిన ప్రతీ 100 మందిలో కేవలం 49 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌‌కు స్పందన కరువతుండటంతో డోసులు వృథా అవుతున్నాయి. పంజాబ్‌లో దాదాపు 1200 వ్యాక్సిన్ డోసులు వృథా అయినట్లు కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ డా.రాజశేఖర్ భాస్కర్ తెలిపారు. బిహార్‌లో వ్యాక్సిన్ డోసుల వృథా 10శాతం లోపే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం కోవాగ్జిన్ డోసులే ఉన్నట్లు తెలిపారు. ఒడిశాలో 1,125 డోసులు వృథా అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అదే సమయంలో జార్ఖండ్,ఆంధ్రప్రదేశ్,పశ్చిమ బెంగాల్,హిమాచల్ ప్రదేశ్,జమ్మూకశ్మీర్,కేరళ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ వృథా అసలు లేకపోవడం గమనార్హం.

టార్గెట్ చేరడం కష్టమే...

టార్గెట్ చేరడం కష్టమే...

వ్యాక్సినేషన్ పట్ల ఇలాగే ఆశించినంత స్పందన రాకపోతే తొలి విడతలో 3కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యాన్ని భారత్ చేరుకోవడం కష్టమనే చెప్పాలి. దాదాపు 40శాతం మంది వైద్యులు ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకోవడం కంటే వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్లు ఎయిమ్స్‌కు చెందిన డా.వినోద్ కుమార్ పేర్కొనడం గమనార్హం. అసలే భారత్‌లో వైద్యులు,హెల్త్ కేర్ సిబ్బంది తక్కువగా ఉన్నారని.. ఇలాంటి తరుణంలో అసలు క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంకా పూర్తి కాని వ్యాక్సిన్‌ను వేసుకోవడానికి వారు సిద్దంగా లేరని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన డేటాతో ముందుకు రావాలని ఆదర్శ్ ప్రతాప్ అనే మరో ఎయిమ్స్ డాక్టర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+