వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత ప్రయోజనాలకే భారత్, సౌదీ, తుర్కియెవ్ మొగ్గు.....అందుకే అగ్రరాజ్యానికి తలొగ్గడం లేదా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఏడాది అక్టోబర్ 25, 26 తేదీల్లో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన 19వ అలీనోద్యమ(నామ్) సదస్సుకు హాజరు కాలేదు.

అంతకుముందు 2016లో వెనిజ్వెలాలో జరిగిన 18వ సదస్సుకు కూడా ప్రధాన మోదీ వెళ్లలేదు.

అలీనోద్యమ ఈ రెండు సదస్సులకు భారత్ తరఫున ఉపరాష్ట్రపతే హాజరయ్యారు.

వెనిజ్వెలా సదస్సుకు భారత్ తరఫున 2016లో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొనగా.. 2019లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

భారత్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న సమయంలో ఈ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సులకు ప్రధాన మంత్రి హాజరు కాకపోవడం నిర్ణయాత్మక చర్యగా భావించవచ్చు.

1961లో నామ్ సదస్సులు ప్రారంభమైనప్పటి నుంచి, భారత్ తరఫున ప్రతి ప్రధాన మంత్రి ఈ సమావేశాలకు హాజరయ్యారు.

కేవలం చౌదరి చరణ్ సింగ్ మాత్రమే ఈ సదస్సుకు వెళ్లలేదు. 1979లో ఈయన తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఉన్నందున ఈ సదస్సుకు హాజరు కాలేదు.

కానీ, నరేంద్ర మోదీ పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. కానీ, ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు.

నెహ్రూ కాలంలోని భారత విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే నరేంద్ర మోదీ ఈ సదస్సులకు హాజరు కావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.

కానీ, ఇదే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ విధానం, అలీనోద్యమ సూత్రాల నుంచి పక్కకు తప్పుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే అలీనోద్యమం వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ దేనివైపుకి తలొగ్గకుండా పెద్ద మొత్తంలో దేశాలన్ని కలిసి ఈ అలీనోద్యమాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ రెండు శక్తిమంతమైన వ్యవస్థల ఒత్తిళ్లకు లొంగకుండా అలీనోద్యమం ధైర్యసాహసాలను ప్రదర్శించింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత మళ్లీ రెండు అగ్ర దేశాల అలాంటి పరిస్థితులు నెలకొంది ఇప్పుడే.

రష్యాతో ఉండాలని లేదంటే యుక్రెయిన్‌కు సాయపడుతున్న అమెరికా ఆధ్వర్యంలోని పశ్చిమ దేశాలకు సాయపడాలని థర్డ్ వరల్డ్ దేశాలపై ఒత్తిడి నెలకొంది.

రష్యాను వ్యతిరేకించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. కానీ, రష్యా చాలా కాలంగా భారత్‌కు మిత్రదేశంగా ఉంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోదీ ప్రభుత్వం తలొగ్గి, రష్యాతో ఉన్న స్నేహ సంబంధాలను దెబ్బతీసుకోవాలనుకోవడం లేదు.

అలాగని, యుక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిని కూడా భారత్ సపోర్టు చేయడం లేదు.

ఒకవైపు అలీనోద్యమ సంప్రదాయాన్ని పక్కన పెడుతున్న ప్రధాని మోదీ, ఈ కఠినతరమైన పరిస్థితిల్లో ఇదే రకమైన మరో విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు విమర్శకులు చెబుతున్నారు.

జనవరి 12, 13వ తేదీల్లో భారత్ ''వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమిట్’’ను నిర్వహించబోతుంది.

దీని కోసం భారత్ 120 దేశాలను ఆహ్వానించింది. ఈ సదస్సు వర్చ్యువల్‌గా జరగనుంది.

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే వంటి ప్రపంచ దేశాల అధినేతలు, నాయకులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు.

ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

గ్లోబల్ సౌత్ అంటే ఏమిటి?

'గ్లోబల్ సౌత్’ అనే పదాన్ని ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా ప్రాంతాలకు వాడుతుంటారు. థర్డ్ వరల్డ్‌నే మనం గ్లోబల్‌ సౌత్‌గా చూడొచ్చు.

యూరప్, ఉత్తర అమెరికా మినహాయించి, మిగిలిన ప్రాంతాలన్నింటిన్ని గ్లోబల్ సౌత్‌లో కలపవచ్చు.

గ్లోబల్ సౌత్‌లో ఉన్న చాలా దేశాలు కూడా తక్కువ ఆదాయం కలిగి, రాజకీయంగా-సాంస్కృతిక పరంగా అట్టడుగున ఉన్న దేశాలు.

సాంస్కృతిక పరంగా లేదా పురోగతి విషయంలో ఉన్న తేడాలను పక్కకు తొలగించడం ద్వారా భౌగోళిక రాజీకయ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని గ్లోబల్ సౌత్ అనే పదాన్ని వాడారు.

గ్లోబల్ సౌత్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలున్నాయి. పారిశ్రామికంగా శక్తిమంతమైన దేశాలతో వీటికి వైరుధ్యాలున్నాయి.

గ్లోబల్ సౌత్‌లో చైనా, జపాన్‌లను పరిగణనలోకి తీసుకోవడం లేదు.

అయితే, గ్లోబల్ సౌత్‌లో ఉన్న దేశాలు, అలీనోద్యమంలో భాగమై ఉన్నాయి.

యుక్రెయిన్ సంక్షోభం తర్వాత, సుదీర్ఘకాలంగా అలీనోద్యమంగా పిలుస్తున్న విధానాన్ని, భారత్ గ్లోబల్ సౌత్‌గా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

అలీనోద్యమం పేరు మార్పు విషయంలో మోదీ యూటర్న్ తీసుకున్నారా?

''మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అలీనోద్యమం నుంచి పక్కకు తప్పుకుంటారని అనిపించింది. అలీనోద్యమం రెండు శిఖరాగ్ర సదస్సులకు మోదీ హాజరు కాలేదు. దీంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. హౌడీ మోదీ కార్యక్రమంతో, మోదీ అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపించింది’’ అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంట్రల్ ఆసియా, రష్యన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజన్ కుమార్ అన్నారు.

2021లో అఫ్గానిస్తాన్‌ నుంచి తన బలగాలన్నింటిన్ని అమెరికా ఉపహరించుకున్నప్పుడు, కనీసం భారత్‌కు ఈ విషయం కూడా తెలియదు.

అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడిన తర్వాత ఆగస్టు 15, 2021లో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు..

అమెరికా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికీ, కనీసం భారత్‌కు తెలియజేయలేదని, తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌కు అఫ్గాన్‌తో ఉన్న సంబంధాలన్ని ఎక్కడికక్కడ స్తంభించాయని రంజన్ కుమార్ అన్నారు.

''బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తర్వాత, అమెరికా కేవలం తన ప్రయోజనాల గురించే ఆలోచిస్తుందని మోదీ ప్రభుత్వం గ్రహించింది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తుందని గుర్తించింది’’ అని రంజన్ కుమార్ అన్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

యుక్రెయిన్‌కు అనుకూలంగా నిలవాలని, రష్యాకు వ్యతిరేక వైఖరి అనుసరించాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెలస్తోంది.

ఇది భారత్‌కు అంత తేలిక కాదు. ఎందుకంటే రష్యా భారత్‌కు ఎంతో కాలంగా మిత్ర దేశంగా ఉంది.

ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు మోదీ ప్రభుత్వం మళ్లీ అలీనోద్యమ విధానాన్నే అనుసరించింది.

ఒకవేళ గ్లోబల్ సౌత్ సదస్సును అలీనోద్యమ సమితిగా పిలిస్తే, వీటి మధ్య ఎలాంటి తేడా లేనట్టే. కానీ, ప్రతి ప్రభుత్వం పలు విషయాలను వెలుపల నుంచి కొత్తగా చూడాల్సి ఉంది.

చర్చనీయాంశంగా భారత్, తుర్కియెవ్, సౌదీ వైఖరి

బలహీనంగా మారుతున్న శక్తిమంతమైన వ్యవస్థలు

యుక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత, గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒకవైపు యుక్రెయిన్‌కు అనుకూలంగా తమతో చేతులు కలపాలని అమెరికా పిలుపు, మరోవైపు అమెరికా నాయకత్వాన్ని సవాలు చేయాలని రష్యా నినాదం గ్లోబల్ సౌత్ దేశాలను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయి.

నియంతృత్వ పాలన సాగించే రష్యా, ప్రజాస్వామ్య దేశం యుక్రెయిన్‌పై దాడి చేస్తోందని అమెరికా అంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రజాస్వామ్య దేశాలు యుక్రెయిన్‌కు అండగా నిలవాలని కోరుతోంది.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, అమెరికా ఈ వాదనను కొట్టివేస్తోంది.

భారత్ మాత్రమే కాదు, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అమెరికా మాటను వినడం లేదు. ఆయా దేశాలు తమ సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయి.

దీనిలో భారత్‌లో పాటు తుర్కియే , సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియాలున్నాయి.

తుర్కియే, భారత్‌లు యుక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకించాయి. కానీ, రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు మాత్రం దూరంగా ఉన్నాయి.

రష్యాతో, అమెరికాతో ఈ రెండు దేశాలు కూడా సాధారణ సంబంధాలనే కొనసాగిస్తున్నాయి.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

అభివృద్ధి చెందుతున్న దేశాలు..

2022లో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ విధానంలో స్వతంత్రను కోల్పోయేందుకు, ప్రయోజనాలు వదులుకునేందుకు అసలు రాజీ పడలేదు.

భారత్, తుర్కియె, సౌదీ అరేబియా, ఇండోనేషియా దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని మరింత విస్తరించుకున్నాయి. ఎవరి ఒత్తిళ్లకు ఈ దేశాలు తలొగ్గలేదు.

ప్రపంచంలో భారత్ అయిదవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఇంధన దిగుమతులు పెరిగాయి.

పశ్చిమ దేశాలు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయనే ఆలోచననే భారత్ పట్టించుకోలేదు.

ఇది మాత్రమే కాదు, రష్యా నుంచి ఎస్-400 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్‌ కొనుగోలు చేయకుండా భారత్‌పై నిషేధం విధిస్తామని అమెరికా హెచ్చరించింది.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందనే ఆరోపణలతో రష్యాను శిక్షించేందుకు 2017లో అమెరికా అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ చట్టం(కాట్సా) ను తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయకుండా ఏ దేశంపైనైనా నిషేధం విధించే ప్రొవిజన్ ఉంది.

అమెరికా ఈ హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదు. నిబంధలున్నప్పటికీ అమెరికా కూడా భారత్‌పై ఎలాంటి ఆంక్షలను విధించలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో, సౌదీ అరేబియా తన ఆయిల్ ఉత్పత్తిని తగ్గించింది.

దీంతో పాటు, చైనాతో సౌదీ అరేబియా పలు ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ కూటమిలో చేరకుండా ప్రస్తుతం అంతర్జాతీయ విధానంలో తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

తుర్కియె కఠిన వైఖరి

నాటోలో తుర్కియె సభ్యదేశమైనప్పటికీ, రష్యా విషయంలో నాటో అధికారిక విధానానికి పూర్తిగా భిన్నమైన వైఖరిని అనురిస్తోంది.

రష్యాపై ఆంక్షలు విధించేందుకు నాటో దేశాలన్ని సమ్మతిస్తే, తుర్కియె మాత్రం వాటిలో చేరేందుకు నిరాకరించింది.

నాటోలో చేరేందుకు ఫిన్‌ల్యాండ్, స్వీడన్‌లపై పలు ఆంక్షలను టర్కీ విధించింది.

అది మాత్రమే కాక, అమెరికా, యూరప్‌లు బహిరంగంగా ఎక్కడా కూడా తుర్కియెకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ విధానంలో సమూల మార్పులు వచ్చాయని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల స్వయం ప్రతిపత్తిని అమెరికా బలవంతంగా అంగీకరించాల్సి వస్తుందని చెబుతున్నారు.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో, అమెరికా, సోవియట్ యూనియన్లు తమ లక్ష్యాల కోసం చాలా మొండివైఖరిని అనుసరించాయి.

తమ క్యాంపులను పెంచుకున్నాయి. ఈ రెండు దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాయి.

చాలా సార్లు అమెరికా, రష్యాలు ఇతర దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నియమించి, తమ వైపుకి తిప్పుకున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రహస్య కార్యకలాపాల ద్వారా కనీసం 26 సార్లు అమెరికా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సాయం చేసిందని క్విన్సీ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన లిండ్సే ఏ రూర్కే చేపట్టిన పరిశోధనలో తెలిపింది.

1973లో సిరియా, ఈజిప్ట్‌లతో ఇజ్రాయిల్ యుద్ధం చేసింది. దీన్నే అక్టోబర్ యుద్ధంగా పిలుస్తారు.

ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు ఇచ్చాయి. ఇజ్రాయిల్‌కి ఇస్తున్న మద్దతుకు వ్యతిరేకంగా అరబ్ ఆయిల్ ఉత్పత్తి దేశాలు పశ్చిమ దేశాలకు ఆయిల్ ఎగుమతులను నిలిపివేశాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికాను సవాలు చేసింది తొలిసారి అప్పుడే.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

చైనా విధానంపై ప్రభావం..

మధ్యప్రాచ్య చాలా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నించింది.

ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో ఈ ప్రయత్నాల్లో అమెరికా విఫలమైంది. ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారిపోతున్నాయి.

ఆర్థికంగా శక్తిమంతంగా మారుతున్న గ్లోబల్ సౌత్ దేశాలు, అమెరికా చెప్పే ప్రతి దానికి గంగిరెద్దులా తలూపాలని అనుకోవడం లేవు.

కానీ, ఇప్పటికీ ఇరాన్, వెనిజ్వెలాలు మాత్రం అమెరికా ఆంక్షల నుంచి పూర్తిగా బయటికి రాలేకపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు బీభత్సంగా పెరుగుతున్న సమయంలో, ఎందుకు ఇరాన్, వెనిజ్వెలాలను మార్కెట్లోకి అనుమతించడం లేదని అమెరికాను ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి.

చైనా విదేశీ విధానాన్ని చాలా వాస్తవికమైనదానిగా పేర్కొంటారు. ఏ దేశానికి చెందిన అంతర్గత వ్యవహారాల్లో కూడా వీరు జోక్యం చేసుకోరు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సహకారం పెంచుకునేందుకు దీని విదేశీ విధానం సాయ పడుతుంది.

మధ్యప్రాచ్యంలో ఎలాంటి ప్రజాస్వామ్యం లేనప్పటికీ, ఆ దేశాలతో ఆర్థిక సహకారాన్ని చైనా పెంచుకుంది.

సహజ వనరులు, వ్యూహాత్మక ప్రాంతం పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ముఖ్యమైనవి.

చర్చనీయాంశంగా భారత్, టర్కీ, సౌదీ వైఖరి

''తుర్కియె దాని ప్రయోజనాలను చాలా తెలివిగా కాపాడుకుంది. పశ్చిమ దేశాలు, రష్యాతో సమతుల్యమైన విధానాన్ని అనుసరించింది. నల్ల సముద్రం నుంచి విదేశాలకు యుక్రెయిన్ ధాన్యాలు వెళ్లేందుకు తుర్కియె ఒక ఒప్పందాన్ని విజయవంతంగా సంపాదించింది’’ అని జేఎన్‌యూలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఆసియా, రష్యన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే అన్నారు.

సౌదీ అరేబియా కూడా రష్యాతో, చైనాతో తన సంబంధాలను మెరుగుపర్చుకుంటోంది.

జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్టు ఆరోపిస్తూ సౌదీ అరేబియాను ఏకాకిని చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంప్రదింపులు చేశారు. కానీ, గత ఏడాది జూలైలో ఆయన తనకు తానుగా సౌదీ అరేబియా వెళ్లారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ అమెరికా వచ్చినప్పుడు జమాల్ ఖషోగ్గి కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మినహాయింపులు ఇచ్చింది.

గత ఏడాది క్రౌన్ ప్రిన్స్‌కి పారిస్ వచ్చినప్పుడు సాదర స్వాగతం లభించింది.

పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, బాలిలో గత నవంబర్‌లో జీ-20 సదస్సుకు ముందు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌ను తమ దేశానికి రావాలని ఆహ్వానించారు.

ప్రస్తుతం భారత్‌ జీ-20కి అధ్యక్షత వహిస్తుంది. ఈ ఏడాది నవంబర్‌లో సదస్సు జరగనుంది. జీ-20లో భారత ఏజెండా గ్లోబల్ సౌత్‌గానే ఉండనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India, Saudi and Turkey are interested in their own interests.....that's why they are not bowing down to the superpower?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X