వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు: 16 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతన్నాయి. గత 58 రోజుల తర్వాత అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 1.20 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా, 3380 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.

దేశంలో 1,20,529 కరోనా కేసులు, 3380 మరణాలు

దేశంలో 1,20,529 కరోనా కేసులు, 3380 మరణాలు

గత 24 గంటల వ్యవధిలో 20,84,421 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 1,20,529 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. శుక్రవారం 3380 మంది కరోనాతో మరణించారు. ముందు రెండు రోజుల్లో మూడువేలకు దిగువనే మరణాలు ఉండగా.. తాజాగా పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు కరోనాబారినపడి 3,44,082 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.

పెరిగిన రికవరీ.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు

పెరిగిన రికవరీ.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు

శుక్రవారం ఒక్కరోజే 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,67,95,549కు చేరింది. దేశంలో రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 5.73 శాతానికి తగ్గింది.

నిన్న 36 లక్షల మందికి టీకా.. వృథా అరికట్టాలన్న ప్రధాని

నిన్న 36 లక్షల మందికి టీకా.. వృథా అరికట్టాలన్న ప్రధాని

జూన్ 4న 36,50,050 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 22,78,60,317కు చేరింది. పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల వృథా కూడా జరుగుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ల వృథాను అరికట్టేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. దేశంలో తొలి డోసు తీసుకున్నవారి సంఖ్య అమెరికాను అధిగమించిందని నీతి ఆయోగ్ ఆరోగ్యశాఖ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

377 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు

377 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు

కాగా, దేశంలోని 377 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగానే ఉందని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో తాజాగా, 16వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 2.80 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో కూడా 16వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu

English summary
Coronavirus: India sees lowest daily COVID-19 cases in 58 days; 1.2 lakh cases, 3,380 deaths in 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X