వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-పుతిన్ భేటీకి ముందు మెగా డీల్- ఏకే 203 రైఫిల్స్ కొనుగోలుకు భారత్ ఒప్పందం

|
Google Oneindia TeluguNews

భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యాతో మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో ఆయుధాల పోటీ పెరుగుతుండటం, అదే సమయంలో దేశంలో సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుధ వ్యవస్ధ మెగురుపర్చుకునేందుకు కలెష్నికోవ్ సిరీస్ ఏకే-203 తుపాకుల్ని కొనుగోలు చేసేందుకు వీలుగా రష్యాతో భారీ డీల్ కుదుర్చుకుంది.

కలాష్నికోవ్ సిరీస్ చిన్న ఆయుధాల తయారీ' రంగంలో సహకారంతో పాటు AK-203 అసాల్ట్ రైఫిల్స్, ప్రోటోకాల్‌ల కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన ఓ కీలక ఒప్పందంపై ఇవాళ భారత్, రష్యా సంతకాలు చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీకి ముందు రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణమంత్రి జనరల్ సెర్గీ షోయిగు ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆరు లక్షలకు పైగా AK-203 అసాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ మోదీ పుతిన్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది.

india signed big deal with russia for procurement of ak 203 assault riffles ahead of modi-putin meet

భారత్ కు ఏకే -203 రైఫిల్స్ అమ్మడంపై రష్యాకుధన్యవాదాలు తెలుపుతూ రక్షణమంత్రి రాజ్ నాద్ సింగ్ ఇవాళ ట్వీట్ కూడా చేశారు. భారత్‌కు రష్యా యొక్క బలమైన మద్దతును తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరుదేశాల సహకారం మొత్తం ప్రాంతానికి శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని తెస్తుందని తాము ఆశిస్తున్నట్లు రాజ్ నాథ్ వెల్లడించారు. చిన్న ఆయుధాలు, సైనిక సహకారానికి సంబంధించి అనేక ఒప్పందాలు/కాంట్రాక్ట్‌లు/ప్రోటోకాల్స్‌పై సంతకాలు చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోని తయారీ కేంద్రంలో ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ ద్వారా ఎకె 203 కలాష్నికోవ్ రైఫిల్స్‌ను తయారు చేసేందుకు దాదాపు రూ. 5,000 కోట్ల డీల్‌కు భారత ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) ఆమోదం పొందిన కొద్ది రోజుల తర్వాత, ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) తాజాగా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దీంతో భారత్ ఈ డీల్ కుదుర్చుకునేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుతం కేంద్రం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ డీల్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

English summary
india have signed a mega deal with russia for procurement of kalashnikov series ak-203 assualt riffles today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X