పాకిస్తాన్ పని ఖతం.. ఇక భారత్ నుంచి చుక్క నీరు కూడా వెళ్లదు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా, పాకిస్తాన్ భూభాగంలోకి నీరు వెళ్లే అన్ని నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి.

ఈ ప్రాజెక్టుల విలువ 15 బిలియన్ డాలర్లు. తమ దేశానికి వచ్చే నదీ జలాలపై ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి సరఫరా తగ్గుతుందని పాకిస్తాన్ ఇప్పటికే గగ్గోలు పెడుతోంది. అయితే సరే పాక్ హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

నదీ జలాల పంపిణీ అనేది భారత వ్యతిరేక ఉగ్రవాదులను నిర్మూలించడం అనే షరతుపైనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే దాయాది దేశానికి తేల్చి చెప్పేశారు. నిజానికి భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తుందన్న విషయం తెలిసిందే.

India to speed up hydropower building on rivers flowing into Pakistan

ఈ ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. కానీ పాకిస్తాన్ పాలకులు ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు జమ్మూ కశ్మీర్ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్లే నదీ జలాలపై భారత్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు కంటి మీద కునుకు కరవైంది.

ఎందుకంటే బ్రహ్మపుత్ర, దాని ఉప నదులపై ఆధారపడి పాకిస్తాన్ లో 80 శాతం సాగు భూముల్లో పంటలు పండుతున్నాయి. గత మూడు నెలలుగా ఆరు జల విద్యుత్ ప్రాజెక్టులు వయబిలిటీ పరీక్షలు నెగ్గాయి. పర్యావరణ, అటవీ అనుమతులు ప్రక్రియలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర ఉపనది చినాబ్ నదిపై చేపట్టే ఈ ప్రాజెక్టలతో 3 వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యం మన దేశానికి సమకూరనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: Days before its annual Indus Water Commission meeting with Pakistan in Lahore, India has stepped up its efforts of building adequate infrastructure to utilise its legitimate share of waters on eastern rivers (Ravi, Beas and Sutlej) of the Indus system. Two of its states - Jammu and Kashmir and Punjab - reached an agreement to resume works on ambitious Shahpur Kandi Dam project.
Please Wait while comments are loading...