వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మోస్.. కొత్త తరహా బ్రహ్మాస్త్రం: ధ్వని కంటే మూడురెట్లు వేగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో సరికొత్త బ్రహ్మాస్త్రం చేరింది. బ్రహ్మోస్‌ను డీఆర్డీఓ మరింత పదును పెట్టింది. అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ లేటెస్ట్ వర్షన్‌ను వియవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోలో టెస్ట్ ఫైర్‌ను నిర్వహించింది. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో దీన్ని తీర్చిదిద్దారు డీఆర్డీఓ అధికారులు. ఈ ప్రయోగ పరీక్ష తర్వాత విజయవంతమైనట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Recommended Video

BrahMos Supersonic Cruise Missile భారత అమ్ముల పొదిలో మరో వజ్రాయుధం..!| Oneindia Telugu

10 రోజుల వ్యవధిలో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతం చేయడం ఇది రెండోసారి. ఈ నెల 11వ తేదీన ఆధునీకరించిన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి రక్షణ శాఖ అధికారుల ప్రయోగించారు. నౌకాదళానికి చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు కొత్తగా అభివృద్ది చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సబ్‌మెరైన్‌లు, నౌకలు, విమానాలు లేదా భూ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల నుంచి దీన్ని ప్రయోగించడానికి వీలు ఉంది. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్‌గా ఏర్పాటైన బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీన్ని అభివృద్ధి చేసింది.

 India successfully test-fires new version of BrahMos missile, can be launched from submarines also

బ్రహ్మోస్ లేటెస్ట్ వర్షన్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయోగించగలదు. సూపర్ సోనిక్ అనే పేరు పెట్టడానికి కారణం కూడా ఇదే. వందశాతం ఖచ్చితత్వం లక్ష్యాన్ని ఛేదించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. దీని రేంజ్‌ను కూడా పెంచుకోవడానికి వీలు ఉంది. శతృవుల రాడార్‌ కన్నుగప్పగలదు. రాడార్‌కు అందకుండా తన లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఈ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి గంటకు 4,300 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ టెస్ట్ ఫైర్ విజయవంతం కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డడీఓ ఛైర్మన్ డాక్టర్ జీ సతీష్ రెడ్డి, ఇతర శాస్త్రవేత్తలను అభినందించారు.

English summary
India successfully test-fires new version of BrahMos missile. The missile is produced by BrahMos Aerospace, an India-Russia joint venture. It can be launched from submarines, ships, aircraft or land platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X