వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్ రాయబారికి సమన్లు.. ప్రధాని లీ కామెంట్ల కలకలం.. ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో ప్రధాని లీ లూంగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలనే అంశం గురించి దివంగత ప్రధాని నెహ్రూను ఉదహరించారు. రైతు కూలీ చట్టం చర్చ సందర్భంగా చర్చ జరిగే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

India summons Singapores envoy over PM Lee Hsien Loongs remarks in Parliament

స్వాతంత్ర్యం సిద్దించాక ఎంత చక్కగా పనిచేశారో అని పేర్కొన్నారు. గొప్ప ధైర్య సాహసాలతో దేశాన్ని అభివృద్ది పథం వైపు నడిపించారని పేర్కొన్నారు. సాంస్కృతిక వైభవం, స్థిరత్వంతో పేరుగడించారని తెలిపారు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయిందని చెప్పారు. దేశంలో గల ఎంపీలపై నేరాలు, కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అందలో రేప్, హత్య కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. సింగపూర్ ప్రజలు నాయకులు, వ్యవస్థను విశ్వసిస్తారని లూంగ్ అన్నారు. రూల్ ఆఫ్ లా కొనసాగుతుందని చెప్పారు. పరోక్షంగా ఇప్పటి భారత్ గురించి విమర్శలు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.

నెహ్రూ గురించి పొగిడి.. ఇప్పుడు ఉన్న ఎంపీలపై మాత్రం కామెంట్స్ చేసిన విధానంపై కేంద్రం మండిపడింది. ఒక్కరు ఇద్దరు నేర చరితులు ఉంటే అందరిపై నింద ఆపాదించడం సరికాదని అభిప్రాయపడింది. వ్యవస్థను కించపరడం ఏంటీ అని మండిపడింది. అదీ కూడా చట్టసభలో తమ దేశంపై ఎలా కామెంట్ చేస్తారని ప్రశ్నించింది. ఈ మేరకు ఇక్కడి రాయబారికి సమన్లు పంపించింది.

English summary
Ministry of External Affairs has summoned Singapore's envoy to India - Simon Wong - over remarks made by the country's Prime Minister Lee Hsien Loong in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X