Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాపై భారత్ మెతక వైఖరి?- అన్నీ మర్చిపోయి..!!

చైనాపై భారత్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చైనా పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇతర సందర్శకులకు విసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇది వరకు నిలిపివేసిన విసాల జారీని పునరుద్ధరించనుంది. కొత్త విసాల జారీ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

చైనా సందర్శకులు, పర్యాటకులకు విసాలను పునరుద్ధరించడం అయిదు సంవత్సరాల తరువాత ఇాదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో వీటిని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

India to resume tourist visas for Chinese citizens

అప్పటి ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు. ఈ ఘర్షణల నేపథ్యంలో అప్పట్లో విసాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది.

వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరించారు. పాంగ్యాంగ్ త్సో సరస్సు, గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో సైనికులు యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఆర్మీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు ఏర్పాటయ్యాయి. అనేక దఫాలుగా సాగాయి.

సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవాలనే సింగిల్ అజెండా కింద చర్చలను నిర్వహించారు. బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద సుదీర్ఘంగా కొనసాగాయి. ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు అప్పట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు.

రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందడుగు వేశారు. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. ఇటీవలే చైనాలో అడుగు పెట్టారు. బీజింగ్‌ లో ఆదేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌ పింగ్‌ తో సమావేశం అయ్యారు.

దీనితో పాటు 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన మోదీ-జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశం వంటి దౌత్య ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి దళాల ఉపసంహరణ, 2020కి ముందున్న గస్తీ ఏర్పాట్లను పునరుద్ధరించడం వంటి అంశాలపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

ఈ క్రమంలోనే- ఈ వీసా పునరుద్ధరణ కూడా చోటు చేసుకుంది. దీనివల్ల ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. భారత పర్యాటక రంగం 2024లో 37 బిలియన్ డాలర్లను నమోదు చేసింది. ఇది 2033 నాటికి 62 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

దీని ద్వారా ఆర్థికంగా కొంత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. 2019లో భారత్ ను సందర్శించిన వారిలో చైనా పర్యాటకులు మూడవ స్థానంలో ఉన్నారు. ఆ ఏడాది 3 లక్షల మందికి పైగా చైనా పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. విసాల పునరుద్ధరణతో పాటు నేరుగా విమాన సర్వీసులను కూడా పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పరిణామంపై సోషల్ మీడియాలో యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆర్థిక ప్రయోజనాలను స్వాగతిస్తుండగా, మరికొందరు చైనా ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని తేల్చి చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+