వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా-చైనా ట్రేడ్ వార్: యాపిల్ లాంటి సంస్థలు భారత్‌వైపు మొగ్గు, త్వరలోనే సొంత స్టోర్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికా, చైనాలు పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఒకే బ్రాండ్ విదేశీ ప్రత్యక్ష రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో పలు దిగ్గజ కంపెనీలు మనదేశం వైపు చూస్తున్నాయి.

దేశీయంగానే యాపిల్ అమ్మకాలు

దేశీయంగానే యాపిల్ అమ్మకాలు

ఈ క్రమంలో భారత్‌లో ఆన్‌లైన్ అమ్మకాలతోపాటు రిటైల్ స్టోర్లను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తెలిపింది. తొలుత ‘యాపిల్ ఆన్‌లైన్ స్టోర్' ద్వారానే దేశీయంగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది.

రిటైల్ స్టోర్లు కూడా..

రిటైల్ స్టోర్లు కూడా..

ఆ తర్వాత విదేశాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మనదేశంలో కూడా సొంత స్టోర్లను ఏర్పాటు చేయనుంది యాపిల్. ఇప్పటి వరకు థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడిన యాపిల్.. ఇక నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను అందించనుంది.

యాపిల్ తోపాటు మరికొన్ని సంస్థలు..

యాపిల్ తోపాటు మరికొన్ని సంస్థలు..

తొలుత ‘యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌' ద్వారానే దేశీయంగా అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంది. తదుపరి విదేశాల్లో ఏర్పాటు చేసిన తరహాలోనే దేశీయంగా సొంత స్టోర్లను నెలకొల్పనుంది. యాపిల్ తోపాటు ఫోక్సోన్, విస్ట్రన్ కార్ప్ లాంటి కంపెనీలు కూడా భారత్‌లో తమ సంస్థలకు చెందిన స్టోర్లను ప్రారంభించనున్నాయి.

నేరుగా యాపిల్ ఉత్పత్తులు.. తొలి స్టోర్ ముంబైలో..

నేరుగా యాపిల్ ఉత్పత్తులు.. తొలి స్టోర్ ముంబైలో..

ఆరు నెలల కాలంలోనే యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది వరకు ముంబైలో యాపిల్ తన తొలి రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మనదేశంలో నేరుగా యాపిల్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో కొంత తక్కువ ధరకే మనకు అందుబాటులోకి రానున్నాయని మార్కటె్ విశ్లేషకులు చెబుతున్నారు.

English summary
India is targeting companies including Apple, Foxconn and Wistron Corp with a charm offensive aimed at encouraging them to shift business out of trade war-hit China, according to a source and a document seen by Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X