india today-c voter exit poll: హర్యానాలో గెలుపెవరిదో తేల్చేసిన ఇండియా టుడే ..!
హర్యానా అసెంబ్లీకి ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనం తీర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే- సీఓటర్ తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో హర్యానాలో ఎన్నికలు ఏకపక్షంగా సాగినట్లు తేలిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్యే ప్రధాన పోరు సాగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాల్లో తేలింది.
హర్యానా అసెంబ్లీ మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 50-58 సీట్లు గెల్చుకోబోతోందని ఇండియా టుడే-సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. రెండో స్ధానంలో ఉన్న బీజేపీకి కేవలం 20-28 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇతరులకు మాత్రం 10-14 సీట్లు వస్తాయని వెల్లడించింది. జేజేపీ కూటమికీ, ఐఎన్ఎన్డీ కూటమికీ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు నాడిపై ఇవాళ పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. వీటన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యమని తేలింది.అధికార బీజేపీకి రెండో స్ధానం తప్పదని వెల్లడైంది. రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. అలాగే రైతులు, రెజ్లర్లు, సైనికుల నిరసనల ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉన్నట్లు కూడా తేలింది. దీంతో బీజేపీకి ఇవన్నీ శాపంగా పరిణమించబోతున్నాయి.












Click it and Unblock the Notifications