వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలి రాజ్యం: ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటించే వారు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌లో 194 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితికి అందిన ఓ వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ అంశంలో చైనాను భారత్ అధిగమించిందని వెల్లడించింది.

భారత్‌లో 1990-92 గణాంకాల ప్రకారం ఆకలితో బాధపడేవారు 1 బిలియన్ మంది ఉన్నారు. కాగా, 2014-15 నాటికి 795 మిలియన్లకు తగ్గింది. 1990-92 ప్రకారం చైనాలో 289 మిలియన్ల మంది ఆకలితో బాధపడేవారని, 2014-15కు వచ్చేసరికి ఆ సంఖ్య 133.8 మిలియన్లకు తగ్గింది. అంటే ఆకలితో బాధపడేవారి సంఖ్యను భారత్ కంటే చైనా గణనీయంగా తగ్గించుకోగలిగిందని తెలిపింది.

తూర్పు ఆసియాలో తగ్గుదల ఎక్కువగా కనిపించిందని నివేదికలో పేర్కొంది. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ 2015' అనే పేరుతో నివేదికను ఐక్యరాజ్యసమితికి అందజేసింది. మొత్తం జనాభాలో ఆహార అభద్రతాభావంతో ఉండేవారి సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో భారత్ కీలకపాత్ర పోషించింది, కానీ, ఇంకా ఆ దేశంలో 194 మిలియన్ల మంది ఆకలితో బాధపడేవారున్నారని పేర్కొంది.

India tops world hunger list with 194 million people

ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రపంచదేశాలు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాయని ఏఫ్‌ఏవో వెల్లడించింది. 2015 నాటికి పోషకాహారలోప ప్రభావాన్ని తగ్గించాలని నిర్దేశించుకున్న మిలీనియం డెవలప్‌మెంట్ గోల్ అనే లక్ష్యాన్ని ఎఫ్‌ఏవో సాధించిందని, మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే చిన్న తేడాతో లక్ష్యానికి చేరువలో ఉందని తెలిపింది.

లాటిన్ అమెరికా, కరేబియన్, ఆగ్నేయ, సెంట్రల్ ఆసియాలో గణనీయమైన పురోగతి ఉందనే విషయాన్ని గుర్తించామని వెల్లడించింది. ఆర్థికవృద్ధి, వ్యవసాయ పెట్టుబడులు, సామాజిక రక్షణతోపాటు రాజకీయ స్థిరత్వం లాంటి అంశాలు ఆకలి బాధలను నిర్మూలించడంలో కీలక పాత్రను పోషిస్తాయనే విషయం తమ విశ్లేషణలో తేలిందని పేర్కొంది.

కాగా, ఆకలి జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలువడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది.
ఆహార భద్రతలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, తద్వారా దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేసిందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్‌ విరుచుకుపడ్డారు. అంతేగాకుండా రెండేళ్లలో పోషకాహార లోపం తగ్గుదల రేటు తగ్గిపోవడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
India is home to 194.6 million undernourished people, the highest in the world, according to the annual report by the Food and Agriculture Organization of the United Nations released on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X