అరుదైన ఘనత: రోటా వైరస్ టీకా రూ. 60కే... ప్రపంచంలోనే అత్యంత చౌక

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి, తయారు చేసిన రోటా వైరస్ టీకాను భారత ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఏటా 80,000 మంది 5 ఏళ్ల లోపు పిల్లలు డయేరియా బారిన పడి మరణిస్తున్నారు. ఈ మరణాలను అడ్డుకట్ట వేయడానికి దాదాపు రూ. 60కే టీకాను తీసుకొచ్చారు.

ఇది ప్రపంచంలో అత్యంత చౌక అని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ పాలుపంచుకుందని ప్రధాని మంత్రి కార్యాలయం విడుదల చేసి ప్రకటనలో పేర్కొంది.

India unveils Rotavirus vaccine, claimed to be cheapest

ప్రస్తుత ధరలతో పోలిస్తే డాలరకు ఒక డోసు ఇవ్వడమేనేది అత్యంత చౌక అని కూడా పేర్కొంది. ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఈ 'రోటావ్యాక్' ప్రపంచంలో లభ్యమవుతున్న మూడో రోటా వైరస్ టీకా కావడం విశేషం.

టీకాను ఆవిష్కరించిన మోడీ అనంతరం మాట్లాడుతూ భారత్‌లో మరిన్ని ఉన్నత స్ధాయి పరిశోధన, అభివృద్ధి, తయారీ కార్యకలాపాలకు రోటా వైరస్ టీకా ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం వైద్య శాస్త్రంలోనే కాకుండా, ఇతర సాంకేతిక పరిజ్ఞానం తదితర విభాగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఇది నాంది పలుకుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+