Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్‌పై భారత్ గెలవడం నచ్చలేదమో మరి: జాతీయ పతాకాన్ని తీసుకోవడానికి నిరాకరించిన జై షా

దుబాయ్: జై షా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి. అంతకుమించి- భారతీయ జనతా పార్టీ బిగ్ షాట్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. మొన్నటికి మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్నీ అంతే ఘనంగా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం.

 డీపీలు మార్చుకున్నారు..

డీపీలు మార్చుకున్నారు..


సోషల్ మీడియాలో యూజర్లందరూ తమ డీపీలను జాతీయ పతాకాలతో నింపేయాలంటూ సాక్షాత్తూ ప్రధానే పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనా తిరంగా ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచనలకు అనుగుణంగా- కోట్లాదిమంది నెటిజన్లు తమ డీపీలను మార్చుకున్నారు. ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది.

 వివాదాలు..

వివాదాలు..

అలాంటి పరిస్థితుల మధ్య దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి. దీనికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని ఆయన ఎదుర్కొనక తప్పక పోవచ్చు. బీసీసీఐ కార్యదర్శిగా ఆయన వివరణ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు.

మ్యాచ్ విజయంతో..


తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఘన విజయం సాధించిన అనంతరం స్టేడియంలో ఎటు చూసినా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. జయజయధ్వానాలతో హోరెత్తాయి. ప్రేక్షకుల సందడితో మారుమోగిపోయింది. చివరి ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ పాండ్యా సిక్స్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించడంతో- అప్పటి వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ను చూస్తోన్న అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది.

 జెండా తీసుకోవడానికి నిరాకరణ..

జెండా తీసుకోవడానికి నిరాకరణ..

వీఐపీ బాక్స్‌లో ఉంటూ మ్యాచ్ చూస్తోన్న జై షా, ఇతర ప్రముఖులు కూడా లేచి నిల్చుని తమ గట్టిగా చప్పట్లు కొట్టారు. తిరంగా రెపరెపలాడించారు. ఆ సమయంలో జై షా పక్కనే నిల్చున్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న జాతీయ జెండాను ఆయనకు అందించడానికి ప్రయత్నించాడు. తన చేతిలో ఉన్న జెండాను జై షా చేతికి ఇవ్వబోగా.. చప్పట్లు కొడుతూ కనిపించిన ఆయన దీన్ని అందుకోవడానికి నిరాకరించారు. తలను అడ్డంగా ఊపారు.

 ఫ్యాన్స్ ఫైర్..

ఫ్యాన్స్ ఫైర్..

దీనికి సంబంధించిన అయిదు సెకెన్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిత్ షా వైఖరిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆయనను ట్రోల్ చేస్తోన్నారు. తిరంగాను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటూ నిలదీస్తోన్నారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ నిలదీస్తోన్నారు. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగువేయాలంటూ సలహాలను మాత్రం ఇస్తారు.. తాము మాత్రం దీన్ని పాటించరంటూ ధ్వజమెత్తుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+