వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Arshdeep Singh: పీకల్దాకా తెచ్చుకున్న టీమిండియా

|
Google Oneindia TeluguNews

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కొనసాగుతోన్న ఆసియా కప్ 2022 సూపర్ 4లో భారత క్రికెట్ జట్టు.. తొలిసారిగా డిఫెన్స్‌లో పడింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన తరువాత ఫైనల్స్ చేరే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకునే దశలో నిలిచింది. ఇకపై ఆడబోయే రెండు మ్యాచ్‌లనూ గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా- టీమిండియా జైత్రయాత్రకు సూపర్ 4 దశలోనే ముగింపు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

పాకిస్తాన్‌పై బెడిసి కొట్టిన ప్లాన్..

పాకిస్తాన్‌పై బెడిసి కొట్టిన ప్లాన్..


పాకిస్తాన్‌పై టీమిండియా ఓడిన విధానం ప్రకంపనలు రేపుతోంది. నిర్ణీత 20 ఓవర్లల్లో 181 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. ఓటమి వెంటాడింది. అనూహ్యంగా పరాజయాన్ని చవి చూసింది. బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులను సంధించినా అదృష్టం తలుపు తట్టలేదు. చివరి మూడు ఓవర్లల్లో ఫలితం తారుమారైంది. చివరి 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించారు. ఆ లక్ష్యాన్ని ఛేదించారు.

 క్యాచ్ డ్రాప్‌తో..

క్యాచ్ డ్రాప్‌తో..

డెత్ ఓవర్లల్లో విజ‌ృంభించి ఆడుతోన్న ఆసిఫ్ అలీ క్యాచ్ డ్రాప్..టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. పాకిస్తాన్ చివరి 15 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో క్యాచ్ డ్రాప్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ ‌సైడ్ హాఫ్‌గా వెలువడిన బంతిని స్లాంగ్ స్వీప్ షాట్ ఆడబోయాడు ఆసిఫ్ అలీ. టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న అర్ష్‌దీప్ సింగ్ దాన్ని అందుకోలేకపోయాడు. చేతుల్లో పడ్డ బంతి నేలపాలైంది.

సూపర్ 4 దశలో..

సూపర్ 4 దశలో..


ఫైనల్స్‌కు చేరుకోవాలంటే సూపర్ 4 దశను అధిగమించాల్సి ఉంటుంది ఏ జట్టుకైనా. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్- ఫైనల్స్ కోసం పోరాడుతున్నాయి. ప్రతి జట్టు కూడా మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్, భారత్-పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లను ఆడేశాయి. శ్రీలంక, పాకిస్తాన్‌ తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి. ఫైనల్స్‌కు మరింత చేరువ అయ్యాయి. ఫైనల్స్ చేరాలంటే- రెండు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది.

లంకేయులతో..

లంకేయులతో..

ఈ పరిస్థితుల మధ్య ఇవ్వాళ టీమిండియా సూపర్ 4లో శ్రీలంకతో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. డాసన్ షనక సారథ్యంలోని శ్రీలంక జట్టుపై గెలిస్తేనే ఫైనల్స్ గడప తొక్కే అవకాశం ఉంది భారత జట్టుకు. మూడింట్లో ఒక మ్యాచ్ ఇప్పటికే ఓడినందున ఇకపై ఆడబోయే రెండింటినీ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది భారత్‌కు. ఈ సాయంత్రం జరిగే శ్రీలంకతో పాటు ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

భారీ మార్పులతో..

భారీ మార్పులతో..


తుదిజట్టులో భారీ మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. జ్వరంతో పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరమైన అవేష్ ఖాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు. అతణ్ని తుదిజట్టులోకి తీసుకోవచ్చు. పాకిస్తాన్‌పై విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను పక్కనపెట్టి అతని స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను తుదిజట్టులో చోటు కల్పించడానికే మొగ్గు చూపొచ్చు. క్యాచ్ డ్రాప్‌తో మ్యాచ్‌ను దూరం చేసిన అర్ష్‌దీప్ సింగ్‌‌కు మరో ఛాన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

టీమిండియా తుదిజట్టు ప్రాబబుల్స్‌లో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్/రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. లంక జట్టు ప్రాబబుల్స్‌లో- పాథుమ్ నిశ్వంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక, ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డాసన్ షనక (కేప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మదుషంక ఆడొచ్చు.

English summary
After a five-wicket defeat to Pakistan, India will take on Sri Lanka in the Super 4 encounter of the Asia Cup 2022 at the Dubai Stadium in what will be a must-win match for the Rohit Sharma-led team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X