Arshdeep Singh: పనిష్మెంట్ తప్పదా?
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కొనసాగుతోన్న ఆసియా కప్ 2022 సూపర్ 4లో భారత క్రికెట్ జట్టు.. తొలిసారిగా ఆత్మరక్షణలో పడింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన తరువాత ఫైనల్స్ చేరే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆడబోయే రెండు మ్యాచ్‌లనూ గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా- టీమిండియా ప్రస్థానానికి.. సూపర్ 4 దశలోనే ముగింపు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సూపర్ 4 దశలో..
ఫైనల్స్‌కు చేరుకోవాలంటే సూపర్ 4 దశను అధిగమించాల్సి ఉంటుంది ఏ జట్టుకైనా. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్- ఫైనల్స్ కోసం పోరాడుతున్నాయి. ప్రతి జట్టు కూడా మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్, భారత్-పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లను ఆడేశాయి. శ్రీలంక, పాకిస్తాన్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి. ఫైనల్స్‌కు మరింత చేరువ అయ్యాయి. ఫైనల్స్ చేరాలంటే- రెండు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది.

లంకేయులతో..
ఈ పరిస్థితుల మధ్య ఇవ్వాళ టీమిండియా సూపర్ 4లో శ్రీలంకతో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. డాసన్ షనక సారథ్యంలోని శ్రీలంక జట్టుపై గెలిస్తేనే ఫైనల్స్ గడప తొక్కే అవకాశం ఉంది భారత జట్టుకు. మూడింట్లో ఒక మ్యాచ్ ఇప్పటికే ఓడినందున ఇకపై ఆడబోయే రెండింటినీ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది భారత్‌కు. ఈ సాయంత్రం జరిగే శ్రీలంకతో పాటు ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

భారీ మార్పులతో..
తుదిజట్టులో భారీ మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. జ్వరంతో పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరమైన అవేష్ ఖాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు. అతణ్ని తుదిజట్టులోకి తీసుకోవచ్చు. పాకిస్తాన్‌పై విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను పక్కనపెట్టి అతని స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను తుదిజట్టులో చోటు కల్పించడానికే మొగ్గు చూపొచ్చు.

అర్ష్‌దీప్‌కు తుదిజట్టులో..
పాకిస్తాన్‌పై గెలవాల్సిన మ్యాచ్‌ను ఒక్క క్యాచ్ డ్రాప్‌తో దూరం చేసిన అర్ష్‌దీప్ సింగ్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఇవ్వాళ శ్రీలంకపై జరిగే మ్యాచ్‌లో ఆయనను తుదిజట్టులోకి తీసుకుంటారా? లేక.. క్యాచ్ డ్రాప్ చేసినందుకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ.. అర్ష్‌దీప్ సింగ్‌కు పనిష్మెంట్ ఇస్తారా? అనేది ఉత్కంఠభరింగా మారింది. పాకిస్తాన్‌పై మ్యాచ్‌లోనే లైన్ అండ్ లెంగ్త్, గుడ్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను కట్టడి చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని మరో ఛాన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

బౌలర్ సత్తా చాటిన లెఫ్ట్ హ్యాండర్..
పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఓ ఫీల్డర్‌గా మాత్రమే విఫలం అయ్యాడు. దురదృష్టవశావత్తూ క్యాచ్‌ను వదిలేశాడు. బౌలర్‌గా మాత్రం సత్తా చాటాడు. 3.5 ఓవర్లల్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు. మిగిలిన బౌలర్లతో పోల్చుకుంటే మెరుగైన రన్‌రేట్ అర్ష్‌దీప్‌దే. భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లకు 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లకు 44, యుజ్వేంద్ర చాహల్ 43 పరుగులు ఇచ్చుకున్నారు. రవిబిష్ణోయ్ కూడా నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చాడు.

తుదిజట్టులో..
టీమిండియా తుదిజట్టు ప్రాబబుల్స్‌లో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్/రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. లంక జట్టు ప్రాబబుల్స్‌లో- పాథుమ్ నిశ్వంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక, ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డాసన్ షనక (కేప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మదుషంక ఆడొచ్చు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications