12-14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారా?: పేరెంట్స్..గెట్‌రెడీ: ఎల్లుండి నుంచే
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నామమాత్రంగా నమోదవుతోంది. రోజూ అయిదు వేలలోపు కొత్త కేసులు రికార్డవుతున్నాయి. మరణాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటోన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ- కోవిడ్ ప్రొటోకాల్స్ ఇంకా అమల్లోనే ఉంటోన్నాయి. వాటిని ఎత్తేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఇంకొద్దిరోజుల పాటు కోవిడ్ ప్రొటోకాల్స్ అమల్లోనే ఉంటాయి.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 2,503 మాత్రమే. 4,377 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 27 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 36,168గా నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా రికార్డయింది. ఇప్పటిదాకా 4,24,41,449 మంది కోవిడ్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. 5,15,877 మంది వైరస్‌కు బలి అయ్యారు. 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం.

వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిే వ్యాక్సిన్‌ను అందజేస్తోన్న విషయం తెలిసిందే. 10 తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడానికి పాఠశాలలు, జూనియన్ కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి మరీ వ్యాక్సిన్ అందజేస్తోన్నారు హెల్త్ వర్కర్లు. ఆయా రాష్ట్రాల విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు దీనికి సహకరిస్తోన్నాయి.
ఇప్పుడు తాజాగా 12 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి అంటే.. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. అలాగే 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి బూస్టర్ డోసులను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసులు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.
Recommended Video
12-14 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ సిఫారసు చేసిందని, దీనిపై ఆమోదముద్ర వేశామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను అంగీకరించామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. దీన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని అన్నారు.












Click it and Unblock the Notifications