ఇరాన్ వైపు వెళ్లొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు: అమెరికా వైమానిక దాడులతో ఉద్రిక్తత!

Recommended Video

    అమెరికా vs ఇరాక్ ఇరాన్ | మూడో ప్రపంచ యుద్ధం కోసమా ?

    న్యూఢిల్లీ: ఇరాక్ పై అమెరికా వైమానిక దాడుల అనంతరం మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలు సాగించవద్దంటూ ఇండియన్ ఎయిర్ లైన్స్ కు యంత్రాంగాన్ని సూచించింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    ఇరాన్ సైనికాధిపతి ఖాసిం సోలేమనిని లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గల అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఖాసిం సోలేమనిపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఖాసింతో పాటు ఇరాకీ మిలీషియా కమాండర్ అబు మెహదీ అల్ ముహండీస్ మరణించారు. ఈ దాడుల ఘటన తరువాత మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    Indian airlines asked to exercise caution to avoid Iranian airspace amid US-Iran tensions

    ఖాసిం సోలేమనిపై దాడి చేసి, హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. అమెరికా రాయబార కార్యాలయానికి ప్రాతినిథ్యవ వహిస్తోన్న స్విట్జర్లాండ్ హైకమిషనర్ కు సమన్లను జారీ చేసింది. ఇలాంటి వాతావరణంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది.

    ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలు సాగించడాన్ని నివారించాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తూ డీజీసీఏ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల వైపు వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు చాలామటుకు మధ్య తూర్పు దేశాల గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గంలో ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+