వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మ కాశ్మీర్ ప్రాంతంలోని అత్యంత సున్నితమైన ఫల్లన్‌వాలా సెక్టార్‌లో భారత్ - పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక సరిహద్దు గస్తీ కేంద్రం సమీపంలో సుమారు 50 మీటర్ల పొడవు కలిగిన ఒక సొరంగ మార్గాన్ని భారత సైనికులు శుక్రవారం కనుగొన్నారు.

కాశ్మీర్‌లోకి మిలిటెంట్లను చొప్పించడానికి ఈ సొరంగ మార్గాన్ని నిర్మించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం మామూలుగా గస్తీ నిర్వహిస్తున్న భారత జవాన్లకు అధీన రేఖపై చాక్లా పోస్టు వద్ద భారత భూభాగంలో సుమారు 50 మీటర్ల పొడవున్న ఓ సొరంగం కనిపించిందని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Indian Army finds 50-metre long tunnel near Pakistan border

రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు ఉండే ఈ సొరంగ మార్గం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్తోందని ఆ ప్రతినిధి తెలిపారు.

అయితే భారత్ వైపు బైటికి వచ్చే మార్గం లేనందున ఇది అసంపూర్తి సొరంగం కావచ్చన్నారు. మరిన్ని వివరాలు నిర్ధారించుకోవడానికి సైనికులు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారని, అయితే ఇది మందుపాతరలు అమర్చిన ప్రాంతం అయినందున దానికి కొంత సమయం పడుతుందన్నారు.

English summary
Army troops discovered a 50-metre long tunnel near a forward post along India-Pakistan border in Jammu region's sensitive Pallanwala sector which could have been used to infiltrate militants into India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X