పాక్ తీవ్రవాదులను అంతం చేసిన భారత్ ఆర్మీ
శ్రీనగర్: భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు పాకిస్థాన్ తీవ్రవాదులను భారత్ భద్రతా బలగాలు కాల్చిచంపాయి. వివాదిత కాశ్మీర్ సరిహద్దుల్లో ముందు జాగ్రత్తగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఉత్తర కాశ్మీర్ లోని తంగ్జర్ సెక్టార్ ప్రాంతంలో ముగ్గురు పాకిస్థాన్ మిలిటెంట్లు భారత్ లోకి చోరబడటానికి విఫలయత్నం చేశారు. భారత్ కు చెందిన ఓ జవాను మీద కాల్పులు జరిపారు.

భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నించిన ముగ్గురిని భద్రతా బలగాలు అంతం చేశాయని ఆర్మీ సీనియర్ అధికారి మనీష్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం జులై వరకు 56 మంది మిలిటెంట్లు కాశ్మీర్ లోకి చొరబడ్డారని, గతేడాది జులై వరకు 36 మంది చొరబడ్డారని అధికారులు అంచనా వేశారని చెప్పారు.
ఈ సంవత్సరం కాశ్మీర్ లోయలో భారత్ భద్రతా బలగాలు ఇప్పటి వరకు 103 మంది మిలిటెంట్లను అంతం చేశారని మనీష్ కుమార్ వివరించారు. భారత్ లో భాగమైన జమ్మూ, కాశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది.












Click it and Unblock the Notifications