నిజాయితీగా ఉంటే చేతగానితనం అనుకుంటారు.. కౌరవులు-పాండవుల్లా: ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం వేకువజామున పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖను దాడి బాలాకోట్, ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రాంతాల్లో జైష్ మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించారు. మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా వెయ్యి కిలోల బరువు గల బాంబులతో ఈ దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా భావిస్తున్నారు.
జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాల్లోల బాలాకోట్ శిబిరం పెద్దది. దాదాపు ఆరు నుంచి ఏడు ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్య ఎక్కువే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, పాకిస్తాన్ ఈ వార్తలను తిప్పికొట్టింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన యుద్ధ విమానాలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ప్రాణనష్టం జరగలేదన్నారు.

పద్యం ట్వీట్ చేసిన ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకార దాడిపై భారత్‌లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కూడా ఓ ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన కొన్ని గంటల్లోనే అధికారిక ట్విట్టర్‌లో ఈ మేరకు పద్యాన్ని పోస్ట్ చేశారు. మన సైనికుల బలాన్ని, ధైర్యాన్ని వివరిస్తూ ఆ పద్యం ఉంది. హిందీలోని పద్యాన్ని పోస్ట్ చేశారు. ప్రముఖ హిందీ కవి రామ్‌ధారీ సింగ్ ఈ పద్యాన్ని రాశారు.
పాండవులను కౌరవులు చూసినట్లుగా
ఓ శత్రువు ముందు నువ్వు నిజాయితీగా ఉంటే అది నీ చేతకానతనం అనుకుంటాడని, పాండవులను కౌరవులు అలాగే చిన్నచూపు చూశారని, మనం మంచిస్థాయిలో ఉండి, గెలిచే సత్తా ఉంటూనే శాంతి చేకూరుతుందని పేర్కొంది. ఇండియన్ ఆర్మీ, ఆల్వేస్ రెడీ అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు వేలాది లైకులు వస్తున్నాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను చూసి గర్విస్తున్నాం
ఇండియన్ ఆర్మీ పోస్టుకు చాలామంది 'ఇండియన్ ఆర్మీని చూసి గర్విస్తున్నాం' అని, 'జైహింద్' అని, 'హౌ ఈజ్ ది జోష్' అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా దాడి జరిగింది.












Click it and Unblock the Notifications