వరుడికి లెక్కలు రావని పెళ్లి రద్దు చేసిన యువతి

మణిపురి: కనీస లెక్కలు కూడా రాని అజ్ఞానిని తాను వివాహం చేసుకునేది లేదంటూ.. పావుగంటలో పెళ్లనగా ఓ యువతి తేల్చి చెప్పేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మణిపురి జిల్లాలోని గులారియాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కుష్బూ అనే యువతికి, ఓంవీర్ అనే యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహం వైభవంగా మొదలైంది. వేడుకలో భాగంగా మంత్రాలను ఉచ్ఛరించాలని పురోహితుడు చెప్పినప్పుడు.. వాటిని వరుడు సరిగ్గా పలకలేకపోవడంతో వధువుకు అనుమానం వచ్చింది.

మరో పావుగంటలో మొత్తం తతంగమంతా పూర్తవుతుందనే సమయంలో.. కొన్ని నాణాలను వరుడుకి ఇచ్చి లెక్క పెట్టమంది వధువు. కాగా, తొమ్మిది తరువాత ఎంతో అతనికి తెలియలేదు. ఆపై మొబైల్ ఫోన్ చేతికిచ్చి తన నంబర్ చెప్పి డయల్ చేయాలని కోరగా.. ఆ పని కూడా చేయలేకపోయాడు.

Indian Bride Calls Off Wedding To ‘Illiterate’ Groom After He Fails ‘Math Test’

ఇక 69, 79 మధ్య తేడా ఎంతని ప్రశ్నించగా.. తెల్లమొహమే సమాధానమైంది. ఇక ఓంవీర్ తనకు వద్దంటూ కుష్బూ నిర్ణయం తీసుకోగా.. ఆమె తల్లిదండ్రుల నుంచి, ఊరి పెద్దల నుంచి మద్దతు లభించింది.

కాగా, వరుడి విద్యార్హతలపై తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని, నిరక్షరాస్యుడు మాత్రమే కాకుండా, అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయని, ఈ పెళ్లి తప్పిపోవడం తమకు బాధను కలిగించలేదని కష్బూ తల్లిదండ్రులు చెప్పారు.

8వ తరగతి వరకూ చదువుకున్న కుష్బూ.. ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనే కోరిక తనకుందని తెలిపింది. ఇది ఇలా ఉండగా, కుష్బూ కాదన్న ఓంవీర్‌కు ఆ మండపంలోనే గంటల వ్యవధిలో మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+