భారత అక్రమ వలసదారుల దారుణ అనుభవాలు: ప్రతి ఒక్కరికీ ఓ గుణపాఠం
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.
తొలి దశలో 205 మంది..
అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించింది.

ఇదీ బ్రేకప్..
పంజాబ్ అమృత్‌సర్‌లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తొలి విడతలో 205 మంది అక్రమ వలసదారులు భారత్‌కు చేరుకున్నారు. వారిలో 104 మంది పంజాబ్‌కు చెందిన వాళ్లే. హర్యాన- 33, గుజరాత్- 33, మహారాష్ట్ర- 3, ఉత్తరప్రదేశ్- 3, చండీగఢ్- 2 ఉన్నారు.
19 మంది మహిళలు..
అమృత్‌సర్ టౌన్- 5, జలంధర్-, పటియాలా-4, హోషియార్‌పూర్- 2, లూధియానా- 2, ఎస్‌బీఎస్ నగర్, గుర్దాస్‌పూర్, తర్న్ తరణ్, సంగ్రూర్, మొహాలి, ఫతేపూర్ సాహిబ్‌కు చెందిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు. అక్రమ వలసదారుల్లో 19 మంది మహిళలు 13 మైనర్లు. అయిదు, ఏడు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలు, నాలుగేళ్ల ఓ బాలుడు వీరిలో ఉన్నారు.
ట్రావెల్ ఏజెంట్ మోసం
గుర్దాస్‌పూర్ జిల్లా హర్దొవాల్‌కు చెందిన జస్పాల్ సింగ్.. విలేకరులతో మాట్లాడారు. తమ అనుభవాలను వివరించారు. ఓ ట్రావెల్ ఏజెంట్ తనను మోసం చేశాడని, అమెరికా వెళ్లడానికి విసా ఇప్పిస్తానంటూ 30 లక్షల రూపాయలను తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల యూఎస్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది ఈ ఏడాది జనవరి 24వ తేదీన అరెస్ట్ చేశారని తెలిపాడు.
11 రోజుల పాటు నిర్బంధం..
ట్రావెల్ ఏజెంట్ తొలుత బ్రెజిల్‌కు పంపించాడని, ఆరు నెలల పాటు అక్కడే అనధికారికంగా నివాసించాల్సి వచ్చిందని వివరించాడు. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించగా.. బోర్డర్ పెట్రోల్ దళాలు అరెస్టు చేశాయి. అక్కడే 11 రోజులు కస్టడీలో ఉండాల్సొచ్చింది.
బేడీలు, గొలుసులు..
ఆ తరువాత తమను ప్రత్యేక క్యాంప్‌కు తరలించారని జస్పాల్ తెలిపాడు. తాము విడుదలైనట్లు భావించినప్పటికీ- అలా జరగలేదని, అమెరికా నుంచి బహిష్కరించనట్లు ఓ పోలీస్ అధికారి తెలియజేసేంత వరకూ తమకు ఈ విషయం తెలియదని పేర్కొన్నాడు. చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులతో బంధించారని, మిలటరీ ఫ్లైట్‌లో అమృత్‌సర్ విమానాశ్రయానికి తీసుకొచ్చారని అన్నాడు.
42 లక్షలు ఖర్చు..
హోషియార్‌పూర్ జిల్లాలోని తహ్లి గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్, అతని స్నేహితుడు తమ అనుభవాలను పంచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో అతను అమెరికాకు వెళ్లారు. అతను కూడా ట్రావెల్ ఏజెంట్ బాధితుడే. 42 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు హర్వీందర్. తొలుత భారత్ నుంచి తొలుత ఖతార్‌కు చేరుకున్నాడు.
ఎత్తయిన పర్వతాలు.. పోటెత్తే సముద్రంలో
అక్కడి నుంచి బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా మీదుగా మెక్సికో వెళ్లాడు. అక్కడి నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించాడు. మెక్సికో చేరుకున్న తరువాత కష్టాలు మొదలయ్యాయి. సరిహద్దులకు చేరుకోవడానికి గడ్డ కట్టించే చలిలో పర్వతాలను అధిగమించాడు. గంటల కొద్దీ సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణించాడు.
సరైన ఆహారం
అతని వెంట ఉన్న అక్రమ వలసదారుల్లో ఒకరు పనామా అడవిలో ఒకరు మరణించాడు. రోజూ 40 నుంచి 45 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. 15 గంటల పాటు మరొకరు సముద్రంలో ప్రయాణించామని హర్వీందర్ సింగ్ మునిగిపోయాడు. ఈ రెండూ చావులనూ కళ్లారా చూశానని హర్వీందర్ సింగ్ చెప్పాడు. సరైన ఆహారం ఉండేది కాదు. రోజులో ఒక్కసారి మాత్రమే అన్నం తినేవాళ్లమని, బిస్కెట్లతో కడుపు నింపుకొనే వాళ్లమని చెప్పాడు.
జారిపడితే- శవం కూడా దొరకదు..
మార్గమధ్యలో వాళ్ల దుస్తులు సైతం చోరీకి గురయ్యాయి. వారు 15 గంటల పాటు పడవ ప్రయాణం చేశారని, 40-45 కిలోమీటర్లు నడిచి వెళ్ళారని ఆయన చెప్పారు. పనామా, మెక్సికో పర్వతాల్లో జారిపడితే- శవం కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఒకరు గాయపడితే చికిత్స అందించే మార్గం కూడా ఉండేది కాదని అలా అడవిలో వదిలేసి వెళ్లొల్సొచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications