పరిస్థితి చేయి దాటింది.. తక్షణమే వెనక్కి వచ్చేయండి: కేంద్రం వార్నింగ్..!
దేశవ్యాప్త నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయక్కడ. హింసాత్మకంగా మారుతున్నాయి. రాజధానితో పాటు పలు ప్రధాన నగరాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం- ఇప్పటివరకు కనీసం 2,500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. వేలాదిమంది ఆందోళనకారులను అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది.
అదే ఇరాన్. నిరసనకారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో క్షేత్రస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారింది. సమాచార బ్లాక్ అవుట్‌తో దేశం లోపల, వెలుపల ప్రజల మధ్య సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. అక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్.. కీలక అడ్వైజరీ ఇచ్చింది. హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశవ్యాప్త నిరసనల అనంతరం ఇంటర్నెట్‌తో పాటు మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్టివిటీని నిలిపివేశారని గుర్తు చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే అడ్వైజరీ ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ముఖ్యంగా ఇరాన్.. ప్రత్యేకించి టెహ్రాన్‌కు వెళ్లవద్దని తెలిపింది.
ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సైతం కోరింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, వాణిజ్య విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి ఇరాన్‌ను విడిచిపెట్టాలని సూచించింది. రాయబార కార్యాలయం పౌరులు, భారతీయ మూలానికి చెందిన వ్యక్తులు (PIOలు) అప్రమత్తంగా ఉండాలని, నిరసనలు, ప్రదర్శనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని, దౌత్య అధికారులతో సన్నిహితంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్‌లో ఉన్న భారత పౌరులందరూ తమ ప్రయాణ డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు, గుర్తింపుకార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఏదైనా సహాయం కోసం తమను సంప్రదించాలని సూచించింది. తక్షణ సహాయం కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాను విడుదల చేసింది. మొబైల్ నంబర్‌లు: +989128109115, +989128109109, +989128109102, +989932179359; ఈమెయిల్: [email protected].
-
స్వయానా ట్రంప్ నోట -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications