ఇండియన్ ఎప్ స్టీన్ ఫైల్స్.. 33మంది చిన్నారులపై రేప్, లైవ్ స్ట్రీమింగ్!

జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేయగా, అదే తరహా అమానుష ఘటనలు భారత్‌లోనూ వెలుగు చూశాయి అన్నది తాజాగా సంచలనంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో బయటపడిన ఈ "ఇండియన్ ఎప్ స్టీన్ ఫైల్స్" కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

33మంది మగపిల్లలపై లైంగిక దాడి, లైవ్ స్ట్రీమింగ్

33 మంది మగ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడి, వారిని చిత్రహింసలు పెట్టి, లైవ్ స్ట్రీమింగ్ చేసిన దంపతులకు ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు మరణశిక్ష విధించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.బందా ప్రాంతానికి చెందిన 50సంవత్సరాల రామ్ భవన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించేవాడు. సమాజంలో ఒక గౌరవనీయమైన అధికారిగా ఉంటూనే అతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు.

Indian Epstein Files Sexual assault on 33 boys live streaming pocso court verdict on UP couple crimes

పేద మగ పిల్లలే లక్ష్యంగా భార్యా భర్తల దారుణం

అతని భార్య దుర్గావతి కూడా ఈ దారుణాలకు పూర్తి సహకారం అందించింది. ఈ జంట సాగించిన దారుణాల విషయానికి వస్తే ఈ జంట 2010 నుంచి 2020 వరకు సుమారు పదేళ్లపాటు తమ పైశాచిక కార్యక్రమాలను కొనసాగించారు. పేద కుటుంబాలకు చెందిన 3 నుంచి 16 ఏళ్ల వయస్సు గల పిల్లలను చాక్లెట్లు, మొబైల్ ఫోన్లు వంటి వస్తువులతో ఆశపెట్టి తమ ఇంటికి రప్పించుకునేవారు.

చిన్నారులపై లైంగిక దాడి.. డార్క్ వెబ్ ద్వారా చైల్డ్ పోర్న్ సైట్ లకు విక్రయం

అక్కడ వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియోలు తీసి 'డార్క్ వెబ్' ద్వారా విదేశీయులకు విక్రయించే వారిని తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చింది. 2020లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'డార్క్ వెబ్' కార్యకలాపాలపై నిఘా పెట్టింది. చిత్రకూట్, బాందా ప్రాంతాల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని గుర్తించింది.

షాక్ అయిన సీబీఐ అధికారులు

పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు రామ్ భవన్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడుల్లో ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో వేల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు ఓసి సిబిఐ అధికారులు షాక్ కు గురయ్యారు. పిల్లలకు తాయిలాలతో వలవేసి, ఆ తర్వాత వారిని బెదిరించి భర్త గదిలోకి పంపించేది. చెప్పిన మాట వింటే ఫోన్ ఇస్తాం.. లేదంటే మీ అమ్మానాన్నలను చంపేస్తాం జైలుకు పంపిస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేసేది.

లైంగిక దాడి వీడియోలు తీయటానికి భర్తకు సహకరించిన భార్య

పిల్లలు భయంతో ఏడుస్తున్నా కూడా దుర్గావతి భర్త గది బయట కాపలా కాసేది. అంతేకాదు ఆ దారుణాలను వీడియోలు తీయడంలో ఆమె రామ్ భవన్ కు సహకరించాలని సిబిఐ దర్యాప్తులో తేలింది.అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను డార్క్ వెబ్ ద్వారా అమెరికా, యూరప్ దేశాల్లోని చైల్డ్ పోర్న్ సైట్లకు విక్రయించే వాడు. విదేశీయులతో ఎన్క్రిప్టెడ్ చాట్ చేయడమే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ కూడా నిర్వహించినట్టు దర్యాప్తులో వెల్లడయింది.

ఇద్దరికీ మరణ శిక్ష విధించిన కోర్టు

ఒకవేళ ఎవరైనా పిల్లలు వీళ్ళ మాట వినకపోతే గొలుసులతో కట్టేసి, బెల్ట్ లతో కొట్టినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా వారింట్లో లభించాయి. ఇక ఈ కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు ఇద్దరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. అరుదైన కేసులలో అత్యంత అరుదైన కేసుగా దీనిని న్యాయస్థానం పేర్కొని శిక్ష విధించడం జరిగింది. వీరి బాధితులైన 33 మంది బాలురకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో ఒళ్ళు గగుర్పొడిచే ఎప్స్టీన్ ఫైల్స్ వెలుగులోకి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+