ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కాదట: ఇది ఖుర్షీద్ మాట
గోవా: భారతదేశంలో అనేక రాష్ట్రాలలో బాంబు పేలుళ్లు, అరాచకాలు సృష్టించిన ఇండియన్ ముజాహిద్దిన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. ఎన్ఐఎ అధికారులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు కొన్ని సంవత్సరాల నుండి ఐఎం ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
అయితే ఇండియా ముజాహిద్దిన్ అనే సంస్థ ఉగ్రవాద సంస్థ కాదని అఖిల బారత కాంగ్రెస్ కమిటి (ఎఐసిసి) మైనార్టీ సెల్ చైర్మన్ ఖుర్షిద్ అహమ్మద్ సయ్యద్ సంచలమైన వ్యాఖ్యాలు చేశారు. గోవా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఖుర్షిద్ అహమ్మద్ సయ్యద్ విలేకరులతో మట్లాడారు.
భారత్, అమెరికాలో ఇండియన్ ముజాహిద్దిన్ కు అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇండియన్ ముజాహిద్దిన్ కు మతపరమైన అభిమానం ఉందని, అంతే కాని వారు ఎప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు.

ప్రపంచంలోని మిగతా దేశాలలో ముస్లీం ఉగ్రవాదులు ఉండవచ్చని, కానీ భారత్ లో ఉన్న ముస్లీంలు ఎప్పుడూ ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గోనలేదని వివరించారు. ఈ విషయంలో తాను చాల స్పష్టంగా ఉన్నానని, తనకుకచ్చితమైన అభిప్రాయం ఉందని అన్నారు.
గతంలో భారతదేశంలో జరిగిన అనేక అరాచకాలకు ఇండియన్ ముజాహిదీన్ కారణం అని విచారణలో వెలుగు చూసింది కదా అని మీడియా ప్రశ్నించగా ఐఎంకు చెడ్డపేరు తీసుకురావడానికి వేరే సంస్థలు అలాంటి పని చేసి ఉంటాయని ఖుర్షిద్ జవాబు ఇచ్చారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులు కొందరు విమర్శలకు దిగుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తి గతం, పార్టీకి సంబంధం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications