రైల్లో రాత్రిపూట ప్రయాణమా? ఇవి తెలుసుకోండి
ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు అందరి ఆప్షన్ రైలు ప్రయాణం. చక్కగా రాత్రి పూట బెర్త్ పై పడుకొని తెల్లవారికి ఊళ్లో దిగి పనులన్నీ చూసుకోవచ్చు. కానీ వాస్తవంలో పరిస్థితి అలా ఉండదు. కొందరు ఫోన్ పెద్దగా మాట్లాడుతుంటే మరికొందరు పెద్ద సౌండ్ తో ఫోన్ లో సినిమాలు చూస్తుంటారు. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు రైల్వేకు సంబంధించిన నియమాలు తెలుసుకోవాలి. ప్రయాణికులు సుఖవంతంగా ప్రయాణం చేయడానికి భారతీయ రైల్వే కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది.
* రాత్రి సమయాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఏ ప్రయాణికుడు వ్యవహరించకూడదు.
* రాత్రి 10.00 గంటలు దాటిన తర్వాత నైట్ ల్యాంప్ ఒక్కటే ఆన్ చేయాలి. మిగతా లైట్లు వేయకూడదు. ఒకవేళ ఆన్ చేయాలనుకుంటే తోటి ప్రయాణికుల నుంచి అనుమతి తీసుకోవాలి.

* రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ప్రయాణికులకు కేటాయించిన సీట్లోనే ఉండాలి. ఏ బెర్త్ వారినీ ఇబ్బందికి గురిచేయకూడదు.
* వికలాంగులు, గర్భిణిలు, సీనియర్ సిటిజన్లకు ఈ నియామాల్లో సడలింపు ఉంటుంది.
* నిర్దేశించిన సమయమే కాకుండా ఇతర సమయాల్లోను వారు నిద్రించడానికి వీలుంది. దీనికి ఏ ప్రయాణికుడు అభ్యంతరం చెప్పకూడదు.
* వీటిలో ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా మీ దృష్టికి వస్తే టీటీఈకి ఫిర్యాదు చేయొచ్చు












Click it and Unblock the Notifications